Shreyas Iyer : సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ కోల్పోవ‌డం, వెన్నునొప్పి పై శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఏం చెప్పినా ఎవ‌రూ అంగీక‌రించ‌లేదు

కేకేఆర్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ప‌లు విష‌యాల పై స్పందించాడు.

Iyer : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఫైన‌ల్‌కు చేరుకుంది. చెపాక్ వేదిక‌గా నేడు (మే 26ఆదివారం) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. శ‌నివారం ఆ జ‌ట్టు ప్రాక్టీస్ చేస్తుండ‌గా చెన్నైలో వ‌ర్షం ప‌డింది. దీంతో మైదానంలో కేకేఆర్ ప్రాక్టీస్‌కు ఆటంకం క‌లిగింది. ఇండోర్‌లోనే ప్రాక్టీస్ చేసుకుంది.

ఈ స‌మ‌యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ప‌లు విష‌యాల పై స్పందించాడు. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవ‌డంతో పాటు వెన్నునొప్పి పై మాట్లాడాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 త‌రువాత తాను వెన్నునొప్పితో ఇబ్బంది ప‌డిన‌ట్లు అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు. అయితే.. త‌న ఇబ్బంది గురించి ఎవ‌రికి చెప్పినా కూడా ఒప్పుకోలేద‌న్నాడు.

Babar Azam : బాబ‌ర్ ఆజాం నుంచి కోహ్లికి ముప్పు.. రోహిత్ శ‌ర్మను వెన‌క్కి నెట్టేశాడు..

ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు శ్రేయాస్ ఎంపికయ్యాడు. మొద‌టి రెండు టెస్టు మ్యాచులు ఆడాడు. వెన్నునొప్పి కారణంగా చివ‌రి మూడు టెస్టుల‌కు అత‌డు దూరం అయ్యాడు. ఎన్‌సీఏలో విశ్రాంతి తీసుకుంటున్న స‌మ‌యంలో అత‌డు ఫిట్‌గా ఉన్నాడ‌ని, ముంబై జ‌ట్టు త‌రుపున ఆడేందుకు అత‌డికి ఎన్‌సీఏ క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే అత‌డు దేశ‌వాళీ క్రికెట్ ఆడ‌లేదు. దీనిపై బీసీసీఐ సీరియ‌స్‌ కావ‌డంతో పాటు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను అయ్య‌ర్‌కు ఇవ్వ‌లేదు. అనంత‌రం శ్రేయ‌స్ అయ్య‌ర్ ముంబై త‌రుపున రంజీట్రోఫీ సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్ ఆడాడు.

ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం అయ్యాక‌.. అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌ని భావించిన‌ట్లు శ్రేయ‌స్ చెప్పాడు. లీగ్‌కు ముందు తాము ఎలాంటి ప్ర‌ణాళిక‌ల‌తో వ‌చ్చామో వాటిని పూర్తిగా మైదానంలో అమ‌లు చేసి ఫ‌లితాల‌ను రాబ‌ట్టిన‌ట్లు వెల్ల‌డించాడు. తాను సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ కోల్పోవ‌డం, జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై చాలా మంది ప్ర‌శ్నించార‌న్నాడు. తాను గ‌తం గురించి ఆలోచించ‌న‌ని, వ‌ర్త‌మానంలో ఉంటాన‌ని శ్రేయ‌స్ చెప్పాడు.  అత్యుత్త‌మ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించేందుకే ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నాడు.

Team India : మ‌ళ్లీ ఇదేం ట్విస్ట్‌.. కోహ్లి లేకుండానే అమెరికా విమానం ఎక్కిన‌ రోహిత్ సేన‌.. హార్దిక్ పాండ్యా సైతం..

ఇక గౌత‌మ్ గంభీర్ గురించి మాట్లాడుతూ.. టీ20 క్రికెట్‌ను అర్థం చేసుకోవ‌డంలో అత‌డిది మాస్టర్ మైండ్ అని చెప్పాడు. కేకేఆర్‌కు రెండు టైటిళ్లు అందించాడ‌ని, ప్ర‌త్య‌ర్థిని బ‌ట్టి అప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను త‌యారు చేసుకుని అమ‌లు చేయ‌డంతో అత‌డు కీల‌క పాత్ర పోషించాడ‌న్నారు. ఫైన‌ల్‌లో మంచి ఆట‌తీరు క‌న‌బ‌రిచి విజేత‌గా నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని శ్రేయాస్ అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు