Vijay – Rashmika : విజయ్ దేవరకొండ పెట్ డాగ్‌తో రష్మిక స్పెషల్ ఫొటో.. వైరల్ అవుతున్న ఫొటో..

తాజాగా రష్మిక పలు కుక్కలు, పిల్లులతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Vijay Deverakonda – Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. పలు మార్లు ఆ రూమర్లపై వీరిద్దరూ ఖండించినా ఏదో రకంగా వీరిపై కామెంట్స్ వస్తుంటాయి. ఇటీవల వీళ్ళు డైరెక్ట్ గా కలిసినట్టు ఫోటోలు, వీడియోలు లేకపోయినా వీరిద్దరూ పెట్టిన ఫొటో లోకేషన్స్ మ్యాచ్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు ఆ ఫోటోలకు లింకులు పెడుతూ మరీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఇంకా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుందో తెలుసా?

తాజాగా రష్మిక పలు కుక్కలు, పిల్లులతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రష్మిక షేర్ చేసిన ఫొటోల్లో విజయ్ దేవరకొండ కుక్క స్టార్మ్ కూడా ఉండటం గమనార్హం. విజయ్ తన సోషల్ మీడియాలో పలుమార్లు తన పెంపుడు కుక్క స్టార్మ్ తో ఫోటోలు షేర్ చేసాడు. ఇప్పుడు అదే కుక్కతో రష్మిక ఫొటో షేర్ చేయడంతో మరోసారి వీరిపై కామెంట్స్ వస్తున్నాయి.

అయితే గతంలో రష్మిక పలుమార్లు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు విజయ్ పెంపుడు కుక్క స్టార్మ్ తో రష్మిక ఈ ఫొటో తీసుకొని ఉండొచ్చు అని తెలుస్తుంది. విజయ్ పెంపుడు కుక్కతో రష్మిక పెట్టిన ఫొటో లేటెస్ట్ అయితే కాదు అని క్లారిటీ ఇస్తున్నారు అభిమానులు. మొత్తానికి పెంపుడు కుక్కతో దిగిన ఫొటో కూడా వైరల్ అయి వీరిద్దరి గురించి మాట్లాడేలా చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు