Pat Cummins : ఐపీఎల్ ఫైన‌ల్‌కు ముందు.. ధోనీ సిక్స్‌ను క‌న్నార్ప‌కుండా చూస్తున్న క‌మిన్స్‌..

ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

SRH Captain Pat Cummins : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా.. ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఫైన‌ల్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేంలో పాట్ క‌మిన్స్ పాల్గొన్నాడు. కాగా.. ప్రెస్ కాన్ఫ‌రెన్స్ ప్రారంభం కావ‌డానికి ముందు పాట్ క‌మిన్స్ కూర్చున్న ఎడమ‌వైపు ఉన్న టీవీలో ధోని సిక్స‌ర్‌కు సంబంధించిన వీడియో ప్లే అవుతోంది.

Shreyas Iyer : సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ కోల్పోవ‌డం, వెన్నునొప్పి పై శ్రేయ‌స్ అయ్య‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఏం చెప్పినా ఎవ‌రూ అంగీక‌రించ‌లేదు

దీన్ని గ‌మ‌నించిన క‌మిన్స్ వెంట‌నే అటువైపుకు త‌ల త‌ప్పి ధోని సిక్స‌ర్ కొట్టిన విధానాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. మ‌హేంద్రుడి బ్యాటింగ్‌ను ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అనంత‌రం మీడియా స‌మావేశంలో ఈ సీజ‌న్‌లో త‌మ జ‌ట్టు ఆట‌తీరును విశ్లేశించాడు. ఈటోర్న‌మెంట్‌లో జ‌ట్టుగా అద్భుతంగా రాణిస్తున్నామ‌ని చెప్పాడు. ‘ఇది చాలా పెద్ద‌ది. మాకు (జయ్‌దేవ్) ఉనద్కత్, భువీ (భువనేశ్వర్ కుమార్) సహా చాలా అనుభవజ్ఞులైన బౌలింగ్ లైనప్ ఉంది. అలాగే, నితీష్ (రెడ్డి), అభిషేక్ వంటి ఆట‌గాళ్లు విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడుతూ జ‌ట్టును గెలిపిస్తున్నారు. జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్న ఆట‌గాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ఫైన‌ల్‌లో అత్యుత్త‌మ ఆట‌తీరు క‌న‌బ‌రిచి విజేత‌గా నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తాం.’ అని క‌మిన్స్ అన్నాడు.

Babar Azam : బాబ‌ర్ ఆజాం నుంచి కోహ్లికి ముప్పు.. రోహిత్ శ‌ర్మను వెన‌క్కి నెట్టేశాడు..

ట్రెండింగ్ వార్తలు