Sajjala On Chandrababu : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూడదు – సజ్జల

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని అన్నారు. ఇదే తన కోరిక అని చెప్పారు.(Sajjala On Chandrababu)

Sajjala On Chandrababu : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని సజ్జల అన్నారు. ఇదే తన కోరిక అని చెప్పారాయన. చంద్రబాబు లాంటి వాళ్లకు దేవతానుగ్రహం ఉండకూడదని తాను కోరుకుంటున్నానని సజ్జల అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు. చంద్రబాబును జనాలు ఇన్నాళ్లు భరిస్తూ వస్తున్నారని సజ్జల అన్నారు.

రాష్ట్రంలో సంచలనం రేపిన ఒంగోలు కారు ఘటనపైనా సజ్జల తన రియాక్షన్ తెలిపారు. దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించారని సజ్జల అన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కింద స్థాయి అధికారి చేసిన తప్పునకు మొత్తం ప్రభుత్వాన్నే తప్పు పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని… ప్రస్తుతం ఆయన సంధికాలంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.(Sajjala On Chandrababu)

Ongole : చాలా కోపం వస్తోంది.. వైసీపీ ప్రభుత్వంపై బాబు సంచలన వ్యాఖ్యలు

”చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు లాంటి వాళ్లకు దేవతానుగ్రహం ఉండొద్దు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూడదు. చంద్రబాబుకు మతి భ్రమించిందని. ప్రస్తుతం ఆయన సంధికాలంలో ఉన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమం. ఒంగోలు ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఉన్మాదం, బరి తెగింపు, లెక్కలేని తనం ఏమైనా ఉన్నాయంటే అది చంద్రబాబే. కిందిస్థాయి అధికారి చేసిన తప్పునకు మొత్తం ప్రభుత్వాన్నే తప్పు పట్టడం కరెక్ట్ కాదు” అని సజ్జల అన్నారు.

కాగా, ఒంగోలులో సీఎం కాన్వాయ్‌ కోసం పోలీసులు, ఆర్టీఏ సిబ్బంది పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ అనే వ్య‌క్తి కారును ఆయ‌న‌కు చెప్ప‌కుండా తీసుకెళ్లడం సంచలనం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై అధికార పక్షాన్ని ప్రతిపక్షం టార్గెట్ చేసింది.

అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఇన్నోవా కారులో తిరుపతికి బయలుదేరారు. బుధవారం రాత్రి ఒంగోలు పట్టణం చేరుకున్నారు. పాత మార్కెట్ సెంటర్ లోని హోటల్ దగ్గర శ్రీనివాస్ కుటుంబం టిఫిన్ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి, ఆర్టీఏ సిబ్బంది అక్కడికి వచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో వాహనం కావాలని అడిగారు. తాము తిరుపతికి వెళ్తున్నామని, వాహనం ఇవ్వడం కుదరదని వారు చెప్పినా వినిపించుకోలేదు. డ్రైవర్ తో సహా వాహనాన్ని తీసుకెళ్లారు. దీంతో తిరుమల వెళ్లాల్సిన శ్రీనివాస్ కుటుంబం ఒంగోలులోనే చిక్కుకుంది. చివరకు మరో వాహనం తెప్పించుకుని వారు తిరుమలకు చేరుకున్నారు.(Sajjala On Chandrababu)

Andhra pradesh: ఒంగోలులో భక్తుల కారు తీసుకెళ్లిన ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఏవీఎం, హోంగార్డు సస్పెన్షన్

ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ పర్యటన కోసం అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్ కోసం పిల్లాపాపలతో తిరుపతి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డుపైనే వదిలేసి కారును లాక్కెళ్లడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసేవ చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు సామాన్య ప్రజల కార్లను లాక్కెళ్లడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.(Sajjala On Chandrababu)

కాగా, ఈ ఘ‌ట‌న‌పై సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ‌నివాస్‌ కారును తీసుకెళ్లిన‌ సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు పి.తిరుపతిరెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంధ్యను అధికారులు సస్పెండ్‌ చేశారు. కారు స్వాధీనం చేసుకున్న‌ ఘటనకు వారిని బాధ్యులను చేస్తూ ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు