Andhra pradesh: ఒంగోలులో భక్తుల కారు తీసుకెళ్లిన ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఏవీఎం, హోంగార్డు సస్పెన్షన్

ఒంగోలులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీఎం కాన్వాయి కోసం కారు కావాలంటూ ఇన్నోవాలో కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్తున్న వేముల శ్రీనివాస్ కారును ఆపి ఆర్టీఏ అధికారులు బలవంతంగా తీసుకెళ్లిన ..

Andhra pradesh: ఒంగోలులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీఎం కాన్వాయి కోసం కారు కావాలంటూ ఇన్నోవాలో కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్తున్న వేముల శ్రీనివాస్ కారును ఆపి ఆర్టీఏ అధికారులు బలవంతంగా తీసుకెళ్లిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అర్థరాత్రి పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పినా వినిపించుకోకుండా కారును తీసుకెళ్లడంతో అర్థరాత్రి రోడ్డుపై శ్రీనివాస్ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఘటనపై పలు విమర్శలు రావడం.. సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనకు బాధ్యులైన హోంగార్డు పి. తిరుపతిరెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంధ్యను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

CM Ys Jagan : మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ ఎందుకు షాక్ ఇచ్చారు?!

పల్నాడు జిల్లా వినుకొండ నుండి వేముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇన్నోవాలో వెళ్తున్నారు. బుధవారం రాత్రి 10గంటలకు అద్దంకి బస్టాండ్ వద్ద కారు ఆపి టిఫన్ చేసేందుకు దిగారు. ఒంగోలు ఆర్టీఏ పోలీసులు ఇన్నోవా వద్దకువెళ్లి సీఎం కార్యక్రమానికి కాన్వాయ్ కోసం డ్రైవర్ పాటు కారు కావాలంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన వేముల శ్రీనివాస్ మేము తిరుపతికి దర్శనకోసం వెళ్తున్నామని, తమది ఈ ప్రాంతం కాదని, తమను ఇబ్బంది పెట్టొద్దని ఆర్టీఏ పోలీసులను వేడుకున్నప్పటికీ.. మరో వెహికిల్ కూడా లభించే పరిస్థితి లేదంటూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇలా చేయాల్సి వస్తుందంటూ డ్రైవర్ తో సహా ఇన్నోవా కారును తీసుకెళ్లారు.

CM Jagan : నెల్లూరు వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్ సీరియస్‌

దీంతో వేమూరి శ్రీనివాస్ కుటుంబ సేప్టీ కోసం ఆర్టీసీ బస్టాండ్లోనే ఉండి అక్కడినుండి ఆర్టీఏ అధికారులనుండి ఇబ్బందులు వస్తాయేమోననే అనుమానంతో తిరుపతికి అద్దెకు కారును మాట్లాడుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు కాకుండా సిటీ శివారులోని హైవేపై ఉన్న సంఘమిత్ర హాస్పటల్ వద్దకు రావాలని డ్రైవర్ కు సూచించిడంతో, సంఘమిత్ర హాస్పటల్ వద్దకు అద్దె కారు రావడంతో కుటుంభ సమేతంగా నేరుగా తిరుమల తిరుపతి దేవ స్థానానికి వెళ్లారు. ఈ విషయంపై బాధితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారు అద్దె చెల్లించేందుకు డబ్బులు లేక పోవడంతో తన బంధువులకు ఫోన్ చేసి డబ్బులను తమ అకౌంట్లోకి వేయించుకోవాల్సిన దుస్థితి తమకు ఎదురైందంటూ భాదితుడు శ్రీనివాస్ వాపోయారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు