Tirumala Nadakadari : తిరుమల నడకమార్గంలో చిరుతల బెడద.. తగ్గుతున్న కాలినడక భక్తుల సంఖ్య

చిరుతల వరుస దాడులతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. తిరుమల భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.

Tirumala Nadakadari Decreasing Devotees

Tirumala Nadakadari Decreasing Devotees : తిరుమలలో చిరుతలు బెంబేలెత్తిస్తున్నాయి. తిరుమల నడకమార్గంలో తరచుగా చిరుతలు భక్తులపై దాడి చేస్తున్నాయి. నడకమార్గంలో వెళ్తోన్న భక్తులపై కొన్ని సమయాల్లో చిరుతలు దాడలు చేసి చంపేస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డు, కాలి నడక మార్గంలో చిరుతలు సంచరిస్తూ భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయి. చిరుతలు చిన్నారులు, పెద్దవారిపై దాడి చేయడం, ఎత్తుకెళ్లి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇటీవలే ఓ ఆరేళ్ల చిన్నారిపై చిరుత డాది చేసి ఎత్తుకెళ్లి చంపిన ఘటన తీవ్రం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో నడకదారిలో వెళ్లాలంటే భక్తులు జంకుతున్నారు. చిరుతల వరుస దాడులతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. తిరుమల భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. తిరుమలకు నడక మార్గం ద్వారా వెళ్లే భక్తుల సంఖ్య తగ్గుతోంది. భక్తులు లేక తిరుమల నడక మార్గం బోసిపోతోంది.

Leopard Trapped : తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత .. 50రోజుల వ్యవధిలో మూడు చిరుతలు..

సాధారణ రోజుల్లో నడకదారుల్లో వెళ్లే భక్తుల సంఖ్య 30 నుంచి 35 వేలు ఉండగా నిన్న (బుధవారం) కాలి నడకన తిరుమలకు 19 వేల భక్తులు మాత్రమే వెళ్లారు. మూడు రోజులుగా భక్తుల సంఖ్య తగ్గుతోంది. నడకమార్గంలో చిరుతల బెడద, ఆంక్షలే కారణమని భక్తులు అంటున్నారు. మరోవైపు తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది.

 

ట్రెండింగ్ వార్తలు