Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసుగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీడీపీ పాలకమండలి సభ్యుడి హోదాలనూ ఉన్నారు చెవిరెడ్డి. చంద్రగిరి నియోజకవర్గాన్ని చెవిరెడ్డి.. తన కంచుకోటగా మార్చుకున్నారు.

Chittoor Lok Sabha Constituency : చిత్తూరు జిల్లా రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉంటాయ్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న చిత్తూరు జిల్లా.. ఆ తర్వాత అనేక మలుపులు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కీలక నేతలంతా వైసీపీలోకి జంప్ కావడంతో… క్రమంగా జిల్లాపై ఫ్యాన్‌ పార్టీ పట్టు సాధించింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో పెత్తనం అంతా మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీదే ! ఆ కుటుంబం ఆమోదముద్ర వేస్తేనే ఎవరికైనా టికెట్ దక్కేది.. మరి ఇప్పుడు చిత్తూరు పార్లమెంట్ రాజకీయం ఎలా ఉంది.. వైసీపీని వెంటాడుతోన్న టెన్షన్ ఏంటి.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుకాబోయే సవాళ్లు ఏంటి.. నగరిలో మంత్రి రోజాను ఇబ్బంది పెడుతున్న పరిణామాలు ఏంటి.. చిత్తూరుపై వైసీపీ పట్టు నిలుపుకుంటుందా.. అధికార పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు టీడీపీ వ్యూహాలేంటి.. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా..

Chittoor MP Reddappa

చిత్తూరు లోక్‌సభ పరిధిలో పెత్తనం పెద్దిరెడ్డి ఫ్యామిలీదేనా ! వైసీపీని వెంటాడుతోన్న టెన్షన్ ఏంటి

చిత్తూరు పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం. వైసీపీకి చెందిన రెడ్డప్ప సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. చిత్తూరు పార్లమెంట్ స్థానంపై వైసీపీ జెండా ఎగరడం అద్భుతమే ! ఇదివరకు జనరల్ సీటుగా ఉన్న చిత్తూరు పార్లమెంట్.. టీడీపీకి కంచుకోటగా ఉండేది. పార్టీ ఆవిర్భావం తర్వాత 1989లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీనే విజయం సాధించింది. అలాంటి చోట టీడీపీకి ఝలక్ ఇస్తూ 2019లో వైసీపీ ఎంపీ స్థానాన్ని ఎగురేసుకుపోయింది. టీడీపీ అభ్యర్థి శివప్రసాద్‌పై గత ఎన్నికల్లో లక్షా 37వేలకు పైగా ఓట్ల మెజారిటీతో రెడ్డప్ప విజయం సాధించారు. మంత్రి పెద్దిరెడ్డి సన్నిహితుడిగా పేరున్న రెడ్డప్ప.. 2024లోనూ వైసీపీ తరఫున మళ్లీ చిత్తూరు బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున ప్రస్తుతం ఎవరూ ఇంచార్జిగా లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన శివప్రసాద్‌ కన్నుమూశారు. దీంతో సైకిల్ పార్టీకి ఇక్కడ అభ్యర్థి కరువయ్యారు. ఐతే ఈసారి చిత్తూరులో మళ్లీ పసుపు జెండా ఎగరడం ఖాయం అని తెలుగు తమ్ముళ్లు ధీమాగా కనిపిస్తున్నారు. ఆఖరి నిమిషంలో కొత్త వ్యక్తిని దింపినా.. గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ చంద్రబాబులోనూ ఉంది. దీంతో ఈసారి చిత్తూరు లోక్‌సభ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

READ ALSO : Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

ఇదిలా వుంటే చిత్తూరు లోక్‌సభ పరిధిలో చిత్తూరు అసెంబ్లీతో పాటు.. చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం సెగ్మెంట్‌లు ఉన్నాయ్. ఇందులో గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా.. మిగిలినవి జనరల్‌. కుప్పం మినహా.. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీనే విజయం సాధించింది.

arani srinivasulu

చిత్తూరు అసెంబ్లీ టికెట్ మళ్ళీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాసులుకే దక్కే చాన్స్‌….

చిత్తూరు అసెంబ్లీలో ఆరణి శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. గత ఎన్నికల్లో మొదటిసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది. మంత్రి పెద్దిరెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే.. తనదైన ముద్రతో నియోజకవర్గంలో నిలదొక్కుకునేందుకు శ్రీనివాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఆయనకు.. మళ్లీ టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే శ్రీనివాసులుతో పాటు.. ఆర్టీసీ బోర్డ్‌ రీజనల్ చైర్మన్‌గా ఉన్న విజయానంద రెడ్డి, మరో నాయకుడు బుల్లెట్ సురేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. పెద్దిరెడ్డి ఆశీస్సులతో టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. టీడీపీకి ఇక్కడ కఠినమైన ఎదురవుతున్నాయ్. సైకిల్ పార్టీకి ఇక్కడ ఇంచార్జి కూడా లేరు. చిత్తూరులో ఒకప్పుడు టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న డీకే ఆదికేశవులు.. ఆయన సతీమణి డీకే సత్యప్రభ చనిపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏఎస్ మనోహర్‌ రెడ్డి.. పార్టీని వీడి రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. దీంతో ఇక్కడ టీడీపీని నడిపించేవారు కరవయ్యారు. పొత్తు ఖరారయితే.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు వెనుకాడకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఐతే జనసేనకు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ నేతలు లేరు. ఐతే ఇక్కడ బలిజ సామాజికవర్గం స్ట్రాంగ్‌గా ఉంది. దీంతో జనసేన ఈ స్థానాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

ms babu

పూతలపట్టులోనూ టీడీపీకి ఇంచార్జి కరవు….వైసీపీ నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపే చాన్స్‌

పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా.. ఇక్కడ ఎమ్మెస్ బాబు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో అభ్యర్థిగా మారిన ఈయన.. అనూహ్యంగా విజయం సాధించారు. పెద్దిరెడ్డి కుటుంబం ఎమ్మెస్ బాబును తెరపైకి తెచ్చింది. ఆయనకు టికెట్ ఇప్పించి.. గెలుపునకు కృషి చేసింది పెద్దిరెడ్డి వర్గమే! ఐతే ఎమ్మెల్యేగా నియోజకవర్గంపై ఎమ్మెస్ బాబు తనదైన ముద్ర వేయలేకపోయారు. ఆయన పనితీరు మీద పార్టీ కేడర్‌ పెద్దగా సంతోషంగా లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ కొత్త అభ్యర్థి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీడీపీకి పూతలపట్టులోనూ ఇంచార్జి లేరు. గతంలో టీడీపీ ఇంచార్జిగా కొనసాగిన లలితకుమారి.. 2009 నుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఓటమే ఎదుర్కొన్నారు. వరుసగా మూడు పరాజయాలతో మనస్థాపానికి గురైన లలిత కుమారి.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి వేటలో ఉంది. డజనుకు పైగా పేర్లు టీడీపీ తరఫున పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Narayana swami

గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నారాయణస్వామి…ఈ సారి కుమార్తెను బరిలో దింపాలన్న ఆలోచన…

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మంత్రి నారాయణస్వామి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర నారాయణస్వామిది. 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన.. 2014, 2019లో గంగాధర నెల్లూరులో విజయం సాధించారు. జగన్‌ కేబినెట్‌లో మంత్రిగానూ కొనసాగుతున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన నారాయణస్వామి.. నియోజకవర్గంలో పాతుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. ఐతే తన కుమార్తె కృపాలక్ష్మిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని నారాయణస్వామి కోరిక. పరిస్థితులు అనుకూలిస్తే… తన కుమార్తెను బరిలో దింపి తాను పక్కకు తప్పుకునేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారనే టాక్‌ నడుస్తోంది. నారాయణస్వామికి నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గ నాయకులతో విభేదాలు ఉన్నాయ్. ఐతే నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ బలంగా లేకపోవడం… నారాయణస్వామికి అడ్వాంటేజ్‌గా మారనుంది. గంగాధర నెల్లూరులోనూ టీడీపీకి ఇంచార్జి లేరు. చిట్టి బాబు నాయుడు అనే స్థానికనేతను.. ప్రస్తుతం తాత్కాలిక ఇంచార్జిగా కొనసాగిస్తున్నారు. నారాయణస్వామికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఇక్కడ టీడీపీ కరువైన పరిస్థితి. టీడీపీ నుంచి దూరమైన మాజీ ఎమ్మెల్యే గాంధీ, హరికృష్ణను అక్కున చేర్చుకుంటారా… లేదంటే మరో కొత్తముఖాన్ని బరిలో నిలుపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

venkat, amarnadh

పలమనేరు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటగౌడ పై అవినీతి ఆరోపణలు…టీడీపీకి పెద్ద దిక్కుగా అమర్నాథ్ రెడ్డి

పలమనేరులో వెంకటగౌడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల వరకు నియోజకవర్గ జనాలకు వెంకటగౌడ పేరు పెద్దగా పరిచయం కూడా లేదు. ఈయనను ఎంకరేజ్ చేసింది కూడా పెద్దిరెడ్డి కుటుంబమే ! బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే వెంకటగౌడను పలమనేరు తీసుకువచ్చి ఎమ్మెల్యేను చేశారు. మూడు పదుల వయసులోనే ఎమ్మెల్యే అయిన వెంకటగౌడకు దూకుడు ఎక్కువ అని పార్టీలో పేరు. నియోజకవర్గంలో అక్రమాలకు, ఇసుక దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తప్ప మరెవరి మాట ఎమ్మెల్యే వినడం లేదనే విమర్శ కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ తానే అభ్యర్థి అని వెంకటగౌడ బహిరంగంగానే ప్రకటించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. కొన్ని విషయాల్లో ఆయన వైఖరి పెద్దిరెడ్డికి కూడా నచ్చడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. పెద్దిరెడ్డి కుటుంబం ఆశీస్సులు దక్కితేనే.. ఆయన మరోసారి ఇక్కడ అభ్యర్థి అవుతారు లేదంటే కొత్త వ్యక్తి తెరపైకి రావడం ఖాయం. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. 30ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న అమర్నాథ్‌ రెడ్డి.. గత ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూశారు. చిత్తూరు జిల్లా టీడీపీకి.. అమర్నాథ్ రెడ్డి పెద్దదిక్కుగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వచ్చినా… ఆయన తీసుకోలేదు. సొంత నియోజకవర్గం పలమనేరుపైనే ఫోకస్ పెంచారు. ఈసారి ఎలాగైనా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఫైట్ ఆసక్తికరంగా మారనుంది.

READ ALSO : Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

chandrababu, bharath

కుప్పం సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ అధినేత చంద్రబాబు….30 ఏళ్లలో ఎప్పుడూ ఎదుర్కొని ఇబ్బందులు

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గడిచిన కొన్నేళ్లుగా కుప్పంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయ్. కుప్పంలో కాలుమోపిన 30ఏళ్లలో ఎప్పుడూ ఎదుర్కొని ఇబ్బందులను… గత మూడేళ్లుగా చంద్రబాబు ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎప్పుడు కుప్పం వచ్చినా.. గొడవలు, అరెస్టులు, కేసులే కనిపిస్తున్నాయ్. ఈ పరిణామాలు చంద్రబాబు మీద జనాల్లో సానుభూతి తెచ్చిపెట్టింది. ఒకరకంగా ఇవన్నీ చంద్రబాబుకు మేలు చేసేవే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ప్రతీ మూడు నెలలకు ఒకసారి కుప్పం వస్తున్న చంద్రబాబు.. ఇక్కడ మూడు రోజులు ఉండి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బరిలో నిలిచి.. వరుసగా ఎనిమిదోసారి విజయం సాధించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీకి భరత్‌ ఇక్కడ ఇంచార్జిగా ఉన్నారు. ఎమ్మెల్సీగా, చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగాను భరత్ కొనసాగుతున్నారు. పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలతో పాటు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడడం.. ఫ్యాన్‌ పార్టీలో కొత్త జోష్‌ నింపింది. చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టం కాదనే భావన.. స్థానిక వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఐతే కుప్పం వైసీపీని వర్గవిభేదాలు వెంటాడుతున్నాయ్. భరత్‌, సెంథిల్ కుమార్ గ్రూప్‌లుగా వైసీపీ విడిపోయింది. సెంథిల్ కుమార్ వ్యవహార శైలిపై భరత్ చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును భరత్‌ ఎదుర్కొంటారని మంత్రి పెద్దిరెడ్డి ఇప్పటికే ప్రకటించినా.. ఆఖరి నిమిషంలో తనకే టికెట్ద క్కుతుందని సెంథిల్ కుమార్ ధీమాగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది వైసీపీకి ఇబ్బంది పెట్టే పరిణామంగా మారడం ఖాయం.

bhaskar reddy, nani

చంద్రగిరి నుండి వరసుగా రెండుసార్లు గెలిచిన చెవిరెడ్డి…. టీడీపీ నుంచి పులివర్తి నాని ఎన్నికల బరిలో

చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరసుగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టీడీపీ పాలకమండలి సభ్యుడి హోదాలనూ ఉన్నారు చెవిరెడ్డి. చంద్రగిరి నియోజకవర్గాన్ని చెవిరెడ్డి.. తన కంచుకోటగా మార్చుకున్నారు. సీఎం జగన్‌కు చెవిరెడ్డి నమ్మిన బంటు. జగన్ ఇంట్లో కుటుంబసభ్యుడిగా మెలుగుతారు. నియోజకవర్గంలో ఏదో ఒక పని చేస్తూ.. చెవిరెడ్డి ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటారు. కరోనా సమయంలో నియోజకవర్గ జనాలను అన్నివిధాలా ఆదుకున్నారు. పండగలకు నియోజకవర్గంలోని కుటుంబాలకు బహుమతులు పంచుతుంటారు. తమను పట్టించుకోవడంలేదని పార్టీలో కొంతమంది అసంతృప్తితో ఉన్నప్పటికీ… అది చెవిరెడ్డిని ఇరుకున పెట్టే స్థాయిలో లేదు. ఐతే పారిశ్రామికవేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల నుంచి విరాళాలు సేకరించి… వాటిని జనాలకు పంచుతుంటారని చెవిరెడ్డిపై విమర్శలు ఉన్నాయ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున మళ్లీ ఆయనే బరిలోకి దిగడం ఖాయం. టీడీపీ నుంచి పులివర్తి నాని ఇంచార్జిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ కన్ఫార్మ్‌. చంద్రబాబు సొంతూరు.. చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. 1994లో టీడీపీ తరఫున చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సైకిల్ పార్టీ గెలిచింది లేదు. మరోసారి చంద్రగిరి బరిలో దిగడం నానికి ఇష్టం లేకపోయినా… అధినేత ఆదేశం మేరకు సర్దుకుపోతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను నాని చురుగ్గా నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డిని ఢీకొట్టడం కష్టమే అని చర్చ నడుస్తున్నా.. ఎక్కడా నిరుత్సాహపడకుండా నియోజకవర్గం చుట్టేస్తున్నారు నాని.

READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

jagadish, bhanuprakash, roja

నగరి లో సొంత పార్టీలోనే రోజాకు ఎక్కువ శత్రువులు… పొలిటికల్‌గా యాక్టివ్ అయిన గాలి జగదీశ్

నగరిలో మంత్రి రోజా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన రోజా.. మంత్రి అయి తన కల నెరవేర్చుకున్నారు. నియోజకవర్గ పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేస్తున్నారు. సొంత ట్రస్టు ద్వారా జనాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేరుకు మంత్రి అయినా.. రోజాకు ఇంటా బయటా సమస్యలే ! విపక్షంతో కంపేర్ చేస్తే సొంత పార్టీలోనే ఆమెకు ఎక్కువ శత్రువులు ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో రోజాకు వ్యతిరేక వర్గాలు ఉన్నాయ్. ఈసారి రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే రోజా పెద్దపీట వేస్తున్నారన్నది ఆ వర్గం ఆరోపణ. జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామితోనూ రోజాకు మంచి సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నగరి టికెట్‌ రోజాకు దక్కడం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఐతే ఇలాంటి ప్రచారాన్ని లెక్కచేయకుండా ముందుకెళ్తున్నారు రోజా. సీఎం జగన్ ఆశీస్సులు తనకు ఉన్నాయని.. మరోసారి ఇక్కడి నుంచే బరిలో ఉంటానని ధీమాగా కనిపిస్తున్నారు. టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ ఇంచార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కేవలం 2వేల 5వందల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ భాను ప్రకాశ్‌ టీడీపీ నుంచి బరిలోకి దిగడం ఖాయం. ఐతచే రోజాపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత కలిసొచ్చే అంశమే అయినా.. దాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో భాను ప్రకాష్ సక్సెస్ కాలేకపోయారు. భానుప్రకాశ్‌కు ఇంటిపోరు మొదలైంది. సోదరుడు గాలి జగదీశ్ కూడా టికెట్ ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జగదీశ్‌కు నియోజకవర్గంలో కొంత అనుచరగణం ఉంది. దీంతో ఎన్నికల నాటికి అన్నాదమ్ముల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. చిత్తూరు పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో నగరి టాప్‌లో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు