హిరణ్యకశిపుడిలా ఈ యుగానికి ఈయన: పోసాని కృష్ణమురళి

సీఎం జగన్‌ను చంపుతానని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అంటున్నారని పోసాని అన్నారు.

Posani Krishna Murali

Posani Krishna Murali: హిరణ్యకశిపుడిలా ఈ యుగానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాక్షసుడని పోసాని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో నెంబర్‌ వన్‌ డాన్‌ చంద్రబాబని చెప్పారు.

సీఎం జగన్మోహన్‌ రెడ్డికి ప్రాణం అంటే లెక్కలేదని, ప్రజా సంక్షేమమే ముఖ్యమని పోసాని మురళీకృష్ణ తెలిపారు. జగన్‌ను చంపడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌ను చంపుతానని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అంటున్నారని పోసాని అన్నారు.

ఎన్నికల సమయంలో ఫేక్‌ వీడియోల గురించి చాలా మంది తీవ్రంగా స్పందిస్తున్నారని మరి జగన్ పై దాడి వంటి సీరియస్‌ ఇష్యూపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గతంలో విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగితే ఉద్దేశపూర్వకంగానే చేయించుకున్నారని చంద్రబాబు అన్నారని చెప్పారు.

ఇది చాలా దుర్మార్గమమని పోసాని మురళీకృష్ణ అన్నారు. దీని గురించి ఎవరూ స్పందించరా అని ప్రశ్నించారు. ఫేక్‌ వీడియోకి ఉన్న విలువ కూడా సీఎం జగన్‌ ప్రాణానికి లేదా అని ఆవేదన చెందారు. మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో.. విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు