Subsidy Rice Scheme: ఏపీ ప్రజలకు బిగ్ గుడ్ న్యూస్.. సబ్సిడీ బియ్యం పంపిణీ షురూ.. కిలో బియ్యంపై రూ.10 ఆదా
ప్రజలకు స్వయంగా సబ్సిడీ బియ్యాన్ని(Subsidy Rice Scheme) పంపిణీ చేసిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ అమ్మకాలు అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Ap Minister Nadendla Manohar launches subsidized rice Scheme
- తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం
- కిలోపై పది రూపాయల ఆదా
- రైతు బజార్లలో విక్రయాలు ప్రారంభం
Subsidy Rice Scheme: పెరుగుతున్న నిత్యావసర ధరల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో తక్కువ ధరలకే బియ్యం విక్రయాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ప్రజలకు స్వయంగా సబ్సిడీ బియ్యాన్ని పంపిణీ చేసిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ అమ్మకాలు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకే అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.
కిలో బియ్యంపై రూ.8 నుంచి రూ.10 ఆదా:
మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో బియ్యం(Subsidy Rice Scheme) ధరలు అత్యంత అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.62 ఉన్న బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని సబ్సిడీ ద్వారా రూ.52 కే అందిస్తున్నారు. అదేవిధంగా మార్కెట్లో రూ.58 పలుకుతున్న బీపీటీ రా బియ్యాన్ని కేవలం రూ.50 కే విక్రయిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ప్రతి కిలో బియ్యంపై రూ.8 నుండి రూ.10 వరకు నేరుగా ఆదా కానుంది.
130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల్లో విక్రయాలు:
ప్రజలకు సులభంగా బియ్యం లభించేలా రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లతో పాటు 500 రైస్ మిల్లుల విక్రయ కౌంటర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ప్రభుత్వ చొరవపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది.
