కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు

Amit Shah Fake Video Case: కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో.. విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు

కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. విచారణకు హాజరుకాని కాంగ్రెస్ నేతలు

Amit Shah

Updated On : May 1, 2024 / 12:06 PM IST

Amit Shah Edit Video Case: కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కోసులో ఢిల్లీ పోలీసులు విచారణకు కాంగ్రెస్ నేతలు హాజరుకాలేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండడంతో విచారణకు హాజరయ్యేందుకు 15 రోజుల సమయం కావాలని కోరారు. విచారణకు రాకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ద్వారక సెక్టార్ 16సీలోని డీసీపీ పోలీసు కార్యాలయంలో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. అలాగే, పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా దీనికి హాజరు కావాల్సి ఉంది.

అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసిన నేపథ్యంలోడ రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై గత నెల 28న ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల వేళ అమిత్ షా వీడియోను పలువురు నేతలు షేర్ చేయడం, పోలీసులు కేసు నమోదుచేయడం కలకలం రేపుతోంది.

Also Read: ఎన్నికల వేళ శుభవార్త.. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో తగ్గుదల