ఎన్నికల వేళ శుభవార్త.. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో తగ్గుదల

హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.855గా కొనసాగుతోంది

ఎన్నికల వేళ శుభవార్త.. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో తగ్గుదల

దేశంలో కమర్షియల్ సిలిండర్ల రేట్లు తగ్గాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.19 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. గృహ అవసరాల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.

ప్రధాన నగరాల్లో ఇలా..

  • ఇవాళ 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1764.50 నుంచి రూ.1745.50కి తగ్గింది
  • హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1994.50గా ఉంది
  • కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1879.00 నుంచి రూ.1859.00కి దిగొచ్చింది
  • ముంబైలో రూ.1717.50 నుంచి రూ.1698.50కి తగ్గింది
  • చెన్నైలో రూ.1930.00 నుంచి రూ.1911కి తగ్గుదల కనపడింది

 గృహ అవసరాల సిలిండర్ల ధరల్లో మార్పులు లేవు

  • 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.855గా కొనసాగుతోంది
  • లక్‌నవూలో రూ.840.5గా ఉంది
  • జైపూర్‌లో రూ.806.50గా కొనసాగుతోంది
  • గురుగ్రామ్‌లో రూ.811.50గా ఉంది
  • ఢిల్లీలో రూ.803గా కొనసాగుతోంది

Also Read: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. ఇప్పుడే కొనేస్తే..