MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా చిప్పగిరిలో టెన్షన్ టెన్షన్.. రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు
MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా చిప్పగిరి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
MLA Virupakshi Arrest
MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా చిప్పగిరి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేను విడుదల చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, జడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు రోడ్డుపైనే కూర్చొని ఆందోళన కొనసాగించారు.
Also Read : Subsidy Rice Scheme: ఏపీ ప్రజలకు బిగ్ గుడ్ న్యూస్.. సబ్సిడీ బియ్యం పంపిణీ షురూ.. కిలో బియ్యంపై రూ.10 ఆదా
ఈ సందర్భంగా వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. తెల్లవారుజామున ఎమ్మెల్యే విరూపాక్షి నివాసం తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని విమర్శించారు. ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షిపై కక్షసాధింపు పరాకాష్టకు చేరిందని ఆరోపించిన ఆమె, వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుందని అన్నారు.
బాధితులనే నిందితులుగా మార్చి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని బుట్టా రేణుక ఆరోపించారు. ఎమ్మెల్యేపై అక్రమ కేసులు బనాయించి తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారని, ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లుగా నివాసంపై దాడి చేసి ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, చట్టం తన పనితాను చేయడం లేదని, అధికార పార్టీ చెప్పిందే చట్టంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
