CM Jagan : కుటుంబానికి రూ.5లక్షలు, వరద పరిహారం ప్రకటించిన సీఎం జగన్

వరదల కారణంగా మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలన్నారు.

CM Jagan : భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. వరదల ధాటికి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం జగన్. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం జగన్ వరద పరిహారం ప్రకటించారు. వరదల కారణంగా మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలన్నారు. వీలైనంత త్వరగా ఈ పరిహాం బాధితులకు అందేలా చూడాలన్నారు జగన్.

Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

మరోవైపు వర్షా కాల వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జగన్. రాష్ట్రంలో వరదల గురించి ఆయన అధికారులతో మాట్లాడారు. ఇక వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్ కు నివేదిస్తారు.

Chandrababu Naidu : భోరున విలపించిన చంద్రబాబు

వరద ముంపు ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధితులు ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగు నీరు అందించాలని జగన్ చెప్పారు.

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. కనీవినీ ఎరుగని జల ప్రళయం ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వానలు, వరదలు అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరులోని తిరుపతి నగరంతో పాటు పలు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. తిరుచానూరులోని వసుంధరానగర్ లో వరద ఉధృతికి ఏకంగా ఓ ఇల్లు కొట్టుకుపోయింది.

భారీ వర్షాలకు తిరుమల-తిరుపతి అతలాకుతలం అవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వస్తున్న వరదతో.. తిరుపతిలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఉగ్రరూపంతో వరద తిరుమలపై విరుచుకుపడుతోంది. జంతువులు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. మోకాలి లోతు నీటిలో స్థానికులు, శ్రీవారి భక్తులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు