CM YS Jagan : 175 స్థానాలే వైసీపీ టార్గెట్, వారికి జగన్ కీలక బాధ్యతలు

రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే వైసీపీ టార్గెట్ అన్నారు సీఎం జగన్. ఆ దిశగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు సూచించారు.

CM YS Jagan : రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే వైసీపీ టార్గెట్ అన్నారు సీఎం జగన్. ఆ దిశగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు సూచించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లే పార్టీకి కీలకం అన్నారు జగన్.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల బాధ్యత జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లదే అని జగన్ చెప్పారు. వీక్ గా ఉన్న చోట ఎమ్మెల్యేలను బలపరచాల్సిన బాధ్యత కూడా వారిదే అని తేల్చి చెప్పారు. నెల నెల ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానన్న జగన్.. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు ప్రతి వారం రివ్యూ చేసుకోవాలన్నారు.

CM Jagan : 2024 ఎన్నికలపై జగన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లకు ఐప్యాక్ టీమ్ ను సీఎం జగన్ పరిచయం చేశారు. వారితో కో-ఆర్డినేషన్ చేసుకుని మంచి ఫలితాలు రాబట్టాలన్నారు.

Nara Chandrababu Naidu : ఏపీలో శ్రీలంక పరిస్ధితులే కనిపిస్తున్నాయి, ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే-చంద్రబాబు

ఆగస్టులోపు జిల్లా కమిటీలు, అక్టోబర్ లోపు గ్రామ, బూత్ కమిటీలు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. గడపగడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లదే అన్న సీఎం జగన్.. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన బాధ్యత కూడా వారిదే అన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పాలన్న జగన్.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానన్నారు.

ట్రెండింగ్ వార్తలు