’Mandous‘ Cyclone : ముంచుకొస్తున్న ‘మాండౌస్’ తుఫాన్ .. ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు..పిడుగులు పడే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండౌస్’అని పేరు పెట్టారు. ఈ మాండౌస్ తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫాను రానున్న 24గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

’Mandous‘ Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండౌస్’అని పేరు పెట్టారు. ఈ మాండౌస్ తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫాను రానున్న 24గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘మాండౌస్’ తుఫాను ప్రభావంతో డిసెంబర్ 8 నుంచి మూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ‘మాండౌస్’ అంటే అరబిక్ భాషలో “నిధి పెట్టె” అని అర్థం.

బుధవారం (డిసెంబర్ 7,2022) ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్యదిశగా పయనించి బుధవారం సాయంత్రానికి తుపాణుగా మారుతుందని అధికారులు తెలిపారు. ఈ తుఫాను ఫలితంగా ఏపీ, తమిళనాడు సముద్ర తీరాల వెంబడి తీవ్రమైన ఉరుములతో కూడా భారీ వర్షాలు కురుస్తాయని..పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

తుఫాను డిసెంబర్ 7 బుధవారం సాయంత్రం ఉత్తర తమిళనాడు తీరం నుండి నైరుతి బంగాళాఖాతం,డిసెంబర్ 8 గురువారం ఉదయం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ ప్రభావంతో డిసెంబర్ 8 నుంచి 10తేదీల్లో ఉత్తర తమిళనాడు..దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందన్నారు. డిసెంబర్ 7, బుధవారం సాయంత్రం నుండి డిసెంబర్ 11 ఆదివారం వరకు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు