Lokesh On TDP Changes : వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకి నో టికెట్, టీడీపీలో సంస్ధాగతంగా సంచలన మార్పులు..!

పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవికి బ్రేక్ తీసుకోవాల్సిందే అని చెప్పారు.

Lokesh On TDP Changes : ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే వ్యూహాలు రచించింది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా సంచలన మార్పులు ఉండబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. మహానాడు జరుగుతున్న వేళ టీడీపీలో సంస్థాగత మార్పుల గురించి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

వరుసగా మూడు సార్లు ఓడిన వారికి ఇకపై టికెట్ ఇవ్వకూడదనే యోచనలో ఉన్నట్టు లోకేశ్ తెలిపారు. చాలాకాలం క్రితమే పొలిట్ బ్యూరోలో ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పినట్టు లోకేశ్ గుర్తు చేశారు. ఇక పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవికి బ్రేక్ తీసుకోవాల్సిందే అని లోకేశ్ చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి నేను బ్రేక్ తీసుకుంటాను అని లోకేశ్ వెల్లడించారు.(Lokesh On TDP Changes)

TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే.. కొత్త రక్తం ఎలా వస్తుంది..? అని లోకేశ్ ప్రశ్నించారు. ఇది నా బలమైన కోరిక అన్న లోకేశ్, పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించినట్లు మీడియాతో చిట్ చాట్ లో తెలిపారాయన. పార్టీలో దీనిపై చర్చ జరుగుతోందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈలోగా కొంతమంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామన్నారు.

30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ లైనులోకి రావడం లేదన్నారు. పని చేయని నేతలకు, ఇంచార్జ్ లకు అవకాశాలుండవని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని తాను భావిస్తున్నా అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు తిరిగి దండం పెడితే చాలు గెలిచిపోయే పరిస్థితి ఉందన్నారు లోకేశ్.

Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ ‘మహానాడు’ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మహానాడులో పాల్గొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత టీడీపీ తన వార్షిక మహానాడు సమావేశాలను ప్రజల మధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఒంగోలు పట్టణమంతా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ మహానాడులో టీడీపీ 17 తీర్మానాలను ఆమోదించనుంది.

మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని.. అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కూడా కనిపించట్లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ పాలనలో హింస పెరిగిపోయిందన్నారు. ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో ఈ మహానాడు జరుపుకుందామని చంద్రబాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు