Srisailam : మల్లన్న సర్వదర్శనం రద్దు, తీవ్ర నిరాశలో భక్తులు

ఆదివారం నుంచి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభించారు. దీక్షా శిబిరాల వదద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు నిర్వహించారు. 15 రోజలు పాటు దీక్షా విరమణ ఉంటుంది. దీక్షను..

Srisailam Sparsha Darshan : ప్రముఖ పుణ్యేత్రంలో ఒకటైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. 2022, ఫిబ్రవరి 20వ తేద ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో మల్లన్న స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. సామాన్య భక్తులతో పాటు శివదీక్ష స్వీకరించిన వారు రావడంతో శ్రీశైలం ఆలయం కిటకిటలాడింది. స్వామి వారి దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పట్టిందంటే ఎంత రష్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు, దీక్షా పరులు వస్తారని ఆలయ అధికారులు ఊహించకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

Read More : Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త: 5 రోజుల పాటు స్పర్శ దర్శనం

ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి లింగ స్పర్శదర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు స్వామివారి స్పర్శదర్శనం తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఐదు రోజుల పాటు భక్తులకు స్వామి వారి లింగ దర్శనం కల్పించనున్నారు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా స్వామివారి స్పర్శదర్శనాన్ని, గర్భాలయాల అభిషేకాలను గతంలో నిలిపివేశారు.

Read More : Srisailam : ఈ నెల 22 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఆదివారం నుంచి శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభించారు. దీక్షా శిబిరాల వదద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు నిర్వహించారు. 15 రోజలు పాటు దీక్షా విరమణ ఉంటుంది. దీక్షను స్వీకరించిన భక్తులకు చంద్రావతి కళ్యాణ మండపం నుంచి ఆలయ తూర్పు మాడవీధి ద్వారా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. స్పర్శ దర్శనం కోసం భక్తులు చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్పర్శ దర్శనం చేయించలేకపోతున్నామని ఆలయ అధికారులు చెప్పడంతో వారు నిరుత్సహానికి గురయ్యారు. దీంతో భక్తులు వెనుదిరిగారు. మంగళవారం నుంచి వచ్చే నెల 04 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు