Janasena Vs Police : జనసేన వర్సెస్ పోలీస్.. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సెక్షన్ 30 యాక్ట్ అమలు

ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.

Janasena Vs Police

Section 30 Act : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన వర్సెస్ పోలీస్ గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల్లో సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంది. నేటి నుండి నెలాఖరు వరకు కాకినాడ నగరం, కాకినాడ రూరల్, పిఠాపురం, అమలాపురం, కొత్తపేట రామచంద్రపురం డివిజన్ లో పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ విధించారు.

ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడం కోసమే ఈ నిబంధనలు అంటూ జనసేన నేతలు మండి పడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారాహి యాత్ర నిర్వహిస్తామని జనసేన నేతలు అంటున్నారు.

Perni Nani : టీజేపీగా‌ మారిన బీజేపీ.. వారి మాటలు వింటే ఒక్క సీటు కూడా గెలవరు : పేర్ని నాని

జూన్ 10 అర్ధరాత్రి నుండి జూన్ 30 వరకు సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతులు లేవు. ఎటువంటి సభలు నిర్వహించాలన్నా పోలీసుల దగ్గర ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు