Dwarampudi Chandrasekhar : పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

తాను తలుచుకుంటే కాకినాడలో పవన్ కు సంబంధించిన ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టనివ్వనని సీరియస్ అయ్యారు. రాష్ట్రం నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను బయటకు పంపించాలన్నారు.

Dwarampudi Chandrasekhar

Dwarampudi Comments Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తన నియోజక వర్గంలో సమావేశం నిర్వహించలేక సర్పవరం జంక్షన్ లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2008లో జనసేన పార్టీ పెట్టి ఏం చేశావని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటికీ ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు. 3 సవంత్సరాల నుండి రాజకీయంలో ఉన్నాను, ఇప్పటికీ తనతో అందరూ ఉన్నారని వెల్లడించారు.

వంగవీటి మోహన రంగా మొదటి మీటింగ్ కాకినాడలో తాను ఆర్గనైజేషన్ చేశానని గుర్తు చేశారు. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ జీరో అని.. తనను విమర్శించే స్థాయి ఆయనది కాదన్నారు. “మార్చి 14న ముఖ్యమంత్రి అభ్యర్థి మనం కాదు, మనకు అంత బలం లేదు అన్నావు.. మూడు నెలల తర్వాత జూన్ 14న ఎమ్మెల్యే అవ్వాలి.. ముఖ్యమంత్రి అవుతాను అన్నావు” అని పవన్ ను నిలదీశారు. కాకినాడ నగరంలో వ్యాపారం చేసుకుంటూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. కాకినాడలో తన సామాజక వర్గం లేనప్పటికీ అందరూ తాను కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Chintamaneni: భుజాలపై ఎక్కించుకుని పవన్ కల్యాణ్ ను గెలిపిస్తా.. చింతమనేని కీలక వ్యాఖ్యలు

“నువ్వు సీఎం అవ్వాలంటే ఒక్క సినిమాలో మాత్రమే సాధ్యం అవుతుంది” అని ఎద్దేవా చేశారు. “నువ్వు ఒక ప్యాకేజ్ స్టార్ వి.. ప్యాకేజ్ కుదరలేదు అందుకే వారాహి పెట్టుకుని రోడ్ పైకి వచ్చావు” అని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. రైస్ వ్యాపారం చేస్తూ రూ.15 వేలు సంపాదించాను అన్నావు అసలు నీకు ఏం తెలుసు అని పవన్ ను ఉద్ధేశించి మాట్లాడారు. “కాకినాడ నుండి రైస్ ఎక్స్ పోర్ట్ అవుతుంది అంటే దానికి మా ముఖ్యమంత్రి కారణం.. నీకు జ్ఞానం లేదు, నీ పక్కన మనోహర్ ఉన్నాడు అడిగి తెలుసుకో” అని అన్నారు. తన దగ్గర రూ.15 వేల కోట్లు లేవని.. ఒక వేళ ఉంటే తాను పవన్ కళ్యాణ్ ను కొనేసేవాడినని తెలిపారు.

పవన్ కు ప్యాకేజ్ కావాలి, కావాలంటే తాను ప్యాకేజ్ ఇస్తానని, రెండు సీట్లు పడేస్తానని చెప్పారు. తాను తలుచుకుంటే కాకినాడలో పవన్ కు సంబంధించిన ఒక్క ఫ్లెక్సీ కూడా కట్టనివ్వనని సీరియస్ అయ్యారు. ఒక అమ్మాయి చేసిన ఫిర్యాదు నిజమో కాదో తెలుసుకో అని సూచించారు. రాష్ట్రం నుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను బయటకు పంపించాలన్నారు.
చంద్రబాబుకు ఇవి లాస్ట్ ఎన్నికలు… చంద్రబాబుతోపాటు పవన్ దుకాణం ముసేస్తామని చెప్పారు.

Warning Letters : ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు.. మావోయిస్టులు, అజ్ఞాత వ్యక్తులు వార్నింగ్ లెటర్స్

తనది డీ బ్యాచ్ అయితే.. పవన్ ది పీ బ్యాచ్ … ప్యాకేజ్ బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. తనకు బేడీలు వేయించడం పవన్ వల్ల కాదన్నారు. పవన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే కాకినాడ నుండి తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు.  “నువ్వు పోటీ చేయకపోతే నువ్వు పిరికి వాడివి అనుకుంటా… నువ్వు నాయకులని, కార్యకర్తలను పాడు చేస్తున్నావు.. నీవు పవన్ కళ్యాణ్ వి అయితే నువ్వు జనసేన పార్టీ అయితే నిన్ను చిత్తుగా ఒడిస్తా.. నేను ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా, నువ్వు రాజకీయాల నుండి తప్పుకో” అని సవాల్ చేశారు.

కాకినాడ నుండి వెళ్లే లోపు తన ఛాలెంజ్ స్వీకరించాలని పవన్ కు సూచించారు.  “నువ్వు చంద్రబాబు నుండి పర్మిషన్ తీసుకో, నేను జగన్ నుండి ప్రకటించుకుంటాను.. డిటైల్స్ తెప్పించుకుని మాట్లాడు.. నేను గెలిస్తే నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నిజమని, నేను గెలిస్తే నువ్వు మాట్లాడిన మాటలు అబద్ధమని తేలుతాయి” అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు