Nara Bhuvaneshwari : చంద్రబాబుతో ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్న భువనేశ్వరి, తిరస్కరించిన జైలు అధికారులు

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె చేసుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు.

NoPermission for Bhuvaneshwari To Meet Chandrababu

Chandrababu Arrest..Nara Bhuvaneshwari : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె చేసుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు.

కాగా ఇప్పటికే చంద్రబాబు కుటుంబ సభ్యలు వారంలో రెండుసార్లు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత మొదటిసారి భువనేశ్వరి..ఆమె కోడలు బ్రాహ్మణితో పాటు లోకేశ్ ములాఖత్  అయ్యారు. ఆ తరువాత చంద్రబాబు కుమారుడు లోకేశ్, ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో భువనేశ్వరి మరోసారి ములాఖత్ కు దరఖాస్తు చేసుకోగా వారంలో మూడుసార్లు కదరదు అంటూ తిరస్కరించారు.

TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

ములాఖత్‌కు అనుమతి నిరాకరించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం.. ములాఖత్‌ విషయంలో కూడా అమానవీయంగా వ్యవహరిస్తోందని..నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అవాకాశం ఉన్నా.. కాదనడం సరికాదని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని దానికి కారణం చంద్రబాబే అనే ఆరోపణలు ఆయనను అరెస్ట్ చేయటం రిమాండ్ కు తరలించటం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ పైనా..జైలులో ఆయన భద్రతపై కూడా కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు