Kottu Satyanarayana : అరెస్ట్ భయంతో ఢిల్లీలో ఖరీదైన హోటల్‌లో దాక్కున్నాడు- లోకేశ్ పై మంత్రి కొట్టు ఫైర్

లోకేశ్ ఆంధ్రాకి రిటర్న్ వస్తే తెలుస్తుంది ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో అని మంత్రి కొట్టు అన్నారు. Kottu Satyanarayana

Kottu Satyanarayana - Lokesh (Photo : Google)

Kottu Satyanarayana – Lokesh : టీడీపీ నేత నారా లోకేశ్ పై ఏపీ దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అరెస్ట్ భయంతో నారా లోకేశ్ ఢిల్లీలోని ఓ ఖరీదైన హోటల్ లో దాక్కున్నారని అన్నారు. తండ్రి జైల్లో ఉంటే కొడుకు ఢిల్లీలో జల్సాలు చేస్తున్నాడని లోకేశ్ పై మండిపడ్డారు. సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేశ్ అన్నారు.. రిటర్న్ గిఫ్ట్ సంగతి సరే.. ముందు లోకేశ్ ఆంధ్రాకి రిటర్న్ రావాలని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లోకేశ్ ఆంధ్రాకి రిటర్న్ వస్తే తెలుస్తుంది ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో అని మంత్రి కొట్టు అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. చంద్రబాబు పీఏ అమెరికాకి, చంద్రబాబుకి డబ్బా కంపెనీలు పెట్టిన తపన్ బోస్ దుబాయ్ కి పారిపోయారని ఆరోపించారు. ఏ నిమిషంలో అయినా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో లోకేశ్ ఢిల్లీలో రోజుకి 2లక్షల విలువైన ఖరీదైన హోటల్ లో దాక్కున్నాడని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.

Also Read..Raghu Veera Reddy: చంద్రబాబు అనకొండ కోరల్లో ఇరుక్కున్నారు.. జగన్‌కూ ఇదే పరిస్థితి వస్తుంది.. ఎందుకంటే?: రఘువీరారెడ్డి

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్ ఏ-14గా చేర్చింది సీఐడీ. ఈ కేసులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేశ్ కు సూచించింది. దీంతో స్వయంగా లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ బృందం ఢిల్లీకి వెళ్లింది.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేశ్ కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి తెలిపారు. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామన్నారు. CrPC 41A నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్ విచారణను ముగిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. దీంతో లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారుల టీమ్ ఢిల్లీకి పయనమైంది.

Also Read..Sajjala Ramakrishna Reddy : టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ.. లక్ష గ్లోబల్స్ కలిస్తే ఒక్క చంద్రబాబుతో సమానం : సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు చేసి లోకేశ్ లబ్ది పొందారని సీఐడీ లోకేశ్ ని ఈ కేసులో ఏ-14గా చేర్చింది. దాంతో ఢిల్లీ నుంచి రాగానే లోకేశ్ ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, వైసీపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సీఐడీని ఆయుధంలా వాడుకుంటోందని లోకేశ్ ఆరోపిస్తున్నారు. తనను అవమానపరిచేందుకే నిందితుడిగా చేర్చారని ఆయన అన్నారు. అరెస్ట్ అయితే చంద్రబాబులా బెయిల్ ఆలస్యం అవుతుందని భావించిన లోకేశ్ అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారనే భయంతోనే నారా లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు