Yuvagalam Padayatra : లోకేష్ యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి.. కృష్ణా జిల్లాలోకి ప్రవేశం

భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.

Nara Lokesh Yuvagalam padayatra

Nara Lokesh Yuvagalam Padayatra : టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రజా అభిమానం పోటెత్తింది. 2కిలోమీటర్ల బ్యారేజీ పొడవునా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. యువగళానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి అయింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు లోకేష్ కు వీడ్కోలు పలికారు.

యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. పసుపు, ఎరుపురంగు బెలూన్లతో యువనేతను ఉమ్మడి కృష్ణా జిల్లా, నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.

Harjot Bains: వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన మంత్రికి పాము కాటు

బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు హోరెత్తాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను అభిమానులు ముంచెత్తారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2,500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 2,500కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీలతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తాననే హామీతో లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు.

ట్రెండింగ్ వార్తలు