Chandrababu Naidu Arrest : చంద్రబాబు నాయుడితో ముగిసిన పవన్ కల్యాణ్ ములాఖత్.. మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. live updates

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్ కానున్నారు

Chandrababu Arrest

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్ ములాఖత్ అయ్యారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 14 Sep 2023 01:00 PM (IST)

    పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..

    చంద్రబాబును అన్యాయంగా రిమాండ్‌కు పంపించారు.. సంఘీభావం తెలిపేందుకు వచ్చా.

    2014లో నరేంద్ర మోదీకి మద్దతు తెలిపినప్పుడు నన్ను అందరూ తిట్టారు.

    దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఆనాడు మోదీకి మద్దతు ఇచ్చాను.

    నేనే ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు వెళ్లను. దానికి అనేక కారణాలు ఉంటాయి.

    ఆరోజు నుంచి ఈరోజు వరకూకూడా నరేంద్ర మోదీ వద్దకు పిలిస్తే వెళ్లాను తప్ప నేను కావాలని వెళ్లలేదు.
    దేశ సమగ్రతను, అభివృద్ధిని ఉద్దేశించే నేను ఏడైనా చేస్తాను.

    2014లో బీజేపీ, తెలుగుదేశంకు మద్దతు ఇవ్వడానికి కూడా ముఖ్యకారణం ఉంది.

    విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం కలిగిన నాయకుడు ఉండాలని నేను భావించా. అందుకే అప్పుడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చా.

    2020 విజన్ అని అప్పట్లో చంద్రబాబు చెప్పినప్పుడు. చాలా మందికి అర్థంకాలా.. ఈరోజు మాధాపూర్‌కు వెళ్తే.. ఒక కొత్త సిటీక్రియేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు.

    చంద్రబాబుతో నాకు విబేధాలు ఉండొచ్చు, అభిప్రాయ బేధాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విబేధించి ఉండొచ్చు. కానీ చంద్రబాబు అనుభవాన్ని, ఆయనకు ఉన్న సమర్థతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదు.

    2019 ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ పార్టీల పరంగా భిన్నమైన ఆలోచనలతో మాత్రమే విడిగా పోటీ చేశాం. నేనెప్పుడూ చంద్రబాబును వ్యక్తిగతంగా వ్యతిరేకించలేదు.

    సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన లక్షలాదికోట్ల టర్నోవర్ ఉన్నటువంటి సిటీని నిర్మించిన వ్యక్తికి.. 317కోట్లు స్కాం పెట్టి ఆయనపై అభియోగం మోపి ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా బాధాకరం.

    చంద్రబాబుపై అభియోగాలు మోపిన వ్యక్తి మహానుభావుడా? లాల్ బహదూర్ శాస్త్రీనా? వాజ్ పేయినా? విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్లే వ్యక్తి.

    ఏపీలో అడ్డగోలు అవినీతి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఎవరూ పశ్నించొద్దా? ఏపీలో నాలుగేళ్లుగా అరాచక పాలన చూస్తున్నాం.

    వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాం.

    ఇది తెదేపా , జనసేన భవిష్యత్తుకోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే.

    ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే నా ఆకాంక్ష

    చట్టాలను అధిగమించి పనిచేసే అధికారులు ఆలోచించుకోవాలి.

    వైకాపా నేతలు మాపై రాళ్లు వేసేముందే ఆలోచించుకోవాలి.

    రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టను. మీకు సమయం ఆరు నెలలు మాత్రమే ఉంది.

    యుద్ధమే కావాలంటే యుద్ధానికి మేము సిద్ధమే.

     

  • 14 Sep 2023 12:56 PM (IST)

    చంద్రబాబు ఆరోగ్యం, భద్రత గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్

  • 14 Sep 2023 12:55 PM (IST)

    చంద్రబాబుతో ముగిసిన పవన్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్.

    దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగిన భేటీ.

  • 14 Sep 2023 11:58 AM (IST)

    రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడితో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్.

  • 14 Sep 2023 11:57 AM (IST)

    రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

  • 14 Sep 2023 11:39 AM (IST)

    రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న బాలకృష్ణ, లోకేశ్, బుచ్చయ్య చౌదరి. కాసేపట్లో జైలు వద్దకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్.

  • 14 Sep 2023 11:10 AM (IST)

    రాజమండ్రి ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్నటువంటి బేబీ గార్డెన్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్. మరికొద్ది సేపట్లో సెంట్రల్ జైలు వద్దకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్.

  • 14 Sep 2023 10:50 AM (IST)

  • 14 Sep 2023 10:40 AM (IST)

    రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రత పెంచిన పోలీసులు. జైలు వద్దకు జనసైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు.

  • 14 Sep 2023 10:37 AM (IST)

    పవన్ కళ్యాణ్‌తో ర్యాలీగా వెళ్ళేందుకు కార్లను అనుమతించని పోలిసులు. కేవలం ఐదు కార్లతో మాత్రమే రాజమండ్రి జైలు వద్దకు వెళ్లాలని సూచించిన పోలీసులు. మండిపడుతున్న జనసేన నేతలు.

  • 14 Sep 2023 10:36 AM (IST)

    రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ వద్దకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. పవన్‌కు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. మదురపూడి ఎయిర్‌పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు బయలుదేరారు.

  • 14 Sep 2023 10:10 AM (IST)

    రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత. మరికొద్ది సేపట్లో జైలు వద్దకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్

  • 14 Sep 2023 09:22 AM (IST)

    హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

  • 14 Sep 2023 08:38 AM (IST)

    తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్ పోర్టువద్దకు చేరుకున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గంలో లోకేశ్ క్యాంపుకు బయలుదేరిన బాలకృష్ణ.

  • 14 Sep 2023 08:36 AM (IST)

    బాలకృష్ణ, లోకేశ్ ఉదయం 10.30 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. మరోవైపు ఉదయం 10.15 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. బాలకృష్ణ, లోకేశ్ తో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. చంద్రబాబును కలిసి పవన్ తన మద్దతు తెలపడంతోపాటు ధైర్యం చెప్పనున్నారు.

  • 14 Sep 2023 08:35 AM (IST)

    ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ కానున్నారు.

  • 14 Sep 2023 08:33 AM (IST)

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పవన్‌ కల్యాణ్‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ ములాఖత్ కానున్నారు

ట్రెండింగ్ వార్తలు