Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అరెస్ట్.. అర్ధరాత్రి హైడ్రామా.. విజయవాడకు వెళ్లెందుకు అనుమతిచ్చిన పోలీసులు

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పవన్ కళ్యాణ్ మూడు కార్లతోనే ముందుకు సాగుతున్నారు.

Pawan Kalyan (1)

Pawan Kalyan Police Permission : విజయవాడకు వెళ్లేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అనుమతి లంభించింది. ఎట్టకేలకు పోలీసులు పవన్ కళ్యాణ్ కు అనుమతి ఇచ్చారు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పవన్ కళ్యాణ్ మూడు కార్లతోనే ముందుకు సాగుతున్నారు. అంతకముందు పవన్ కళ్యాన్ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. అనంతరం విజయవాడకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు.

అంతకముందు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు జరిగే పీఏసీ మీటింగ్ లో పాల్గొనేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని ఎంత విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో ఆయన్ను జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కూడా ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. జనసైనికులపై లాఠీఛార్జ్

అయితే అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. ఆ తర్వాత వారిని విడిచి పెట్టారు. విజయవాడకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతకమందు పవన్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. విజయవాడ-హైదరాబాద్ హైవేపై హైటెన్షన్ నెలకొంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెకోపోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.  కానీ వాటిని జనసైనికులు తొలగించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.

ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుమంచిపల్లి దగ్గర మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మళ్లీ గరికపాడు దగ్గర పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని జనసేనాని నిరసన తెలిపారు. హైదరాబాద్ -విజయవాడ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. పవన్ కళ్యాణ్ ను గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు కలిశారు.

 

ట్రెండింగ్ వార్తలు