Real Estate Dispute : విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం-మహిళకు బెదిరింపులు

విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం వెలుగుచూసింది. భీమిలి దగ్గర పది ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పదం కుదుర్చుకున్న రియల్ ఎస్టేట్ యజమాని పూర్తి డబ్బులు చెల్లించకుండానే రిజిష్ట్రేషన్  చేయమని భూ

Real Estate Dispute : విశాఖలో రియల్ ఎస్టేట్ వివాదం వెలుగుచూసింది. భీమిలి దగ్గర పది ఎకరాల భూమి కొనుగోలుకు ఒప్పదం కుదుర్చుకున్న రియల్ ఎస్టేట్ యజమాని పూర్తి డబ్బులు చెల్లించకుండానే రిజిష్ట్రేషన్  చేయమని భూమి యజమానురాలిపై బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు విశాఖ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

బీమిలి దగ్గర తనకు ఉన్న 10 ఎకరాల భూమిని అమ్మేందుకు ఒక మహిళ సుదర్శర్ రెడ్డి అనే వ్యక్తితో ఎగ్రిమెంట్ చేసుకుంది. అందులో భాగంగా సుదర్శన్ రెడ్డి రూ. 22 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించాడు. ఇంకా మిగిలిన మొత్తం చెల్లించకుండానే మొత్తం భూమిని తన  పేరున రిజిష్ట్రేషన్ చెయ్యాలని సుదర్శన్ రెడ్డి సదరు మహిళపై ఒత్తిడి చేయసాగాడు.

సుదర్శన్ రెడ్డి గురించి ఆరాతీయగా అతని నేర చరిత్ర బయటపడింది.  శ్రీ శివ ఇన్ ప్రా రియల్ ఏస్టేట్ పేరుతో సుదర్శన్ రెడ్డి అకృత్యాలు చేసినట్లు ఆమె తెలుసుకుంది. దీంతో ఆమె సుదర్శన్ రెడ్డితో చేసుకున్నవ ఎగ్రిమెంట్ రద్దు చేసుకుంది. ఎగ్రిమెంట్ రద్దుచేసుకోవటంతో సుదర్శన్  రెడ్డి మహిళను బెదిరించటం మొదలెట్టాడు.
Also Read :Tirupati Murder : తిరుపతిలో వృద్ధుడి దారుణ హత్య
భూమి రిజిష్ట్రేషన్ అగితే ఉరుకోనేది లేదంటు మహిళపై లైంగిక వేధింపులు పాల్పడటంతో మహిళ నాలుగో పట్టణ పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సుదర్శన్ రెడ్డి పరారీలో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు