Mohan Babu Meets Chandrababu : హాట్ టాపిక్‌గా మారిన చంద్రబాబు, మోహన్ బాబు మీటింగ్.. కారణం ఏంటంటే..

చంద్రబాబు, మోహన్ బాబు మీటింగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కలయిక రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. చంద్రబాబుని మోహన్ బాబు ఎందుకు కలిశారు? కారణం ఏంటి? అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది.(Mohan Babu Meets Chandrababu)

Mohan Babu Meets Chandrababu : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఇరువురూ కలిసి దాదాపు గంట సేపు సమావేశం అయ్యారు. ఏపీ రాజకీయాల గురించి చంద్రబాబు, మోహన్ బాబు చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, మోహన్ బాబు మీటింగ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కలయిక రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. చంద్రబాబుని మోహన్ బాబు ఎందుకు కలిశారు? కారణం ఏంటి? అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది.

ఇది ఇలా ఉంటే.. మోహన్ బాబు చంద్రబాబును కలవడం వెనుక కారణం ఏంటో టీడీపీ వర్గాలు తెలిపాయి. తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ సమీపంలో నిర్మించిన‌ సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠాపన ఆగస్ట్ నెలలో మోహన్ బాబు చేయనున్నారట. ఈ కార్యక్రమానికి చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించారట. అంతే తప్ప వీరిద్దరి భేటీ వెనుక మరో కారణం లేదంటున్నారు. మోహన్ బాబు చంద్రబాబుని కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి.

CM YS Jagan : 175 స్థానాలే వైసీపీ టార్గెట్, వారికి జగన్ కీలక బాధ్యతలు

ఒకప్పుడు చంద్రబాబు, మోహన్ బాబు మంచి మిత్రులు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో దూరం ఏర్పడింది. భిన్నదృవాలుగా మారిపోయారు. అనేక సందర్భాల్లో చంద్రబాబుపై మోహన్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఒకరకమైన పోరాటమే చేశారని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు చాలా కాలంగా వైసీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అంతేకాదు సీఎం జగన్ కి ఆయన దగ్గరి బంధువు అవుతారు.

CM Jagan : 2024 ఎన్నికలపై జగన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

కాగా, జగన్ తో మోహన్ బాబుకి విబేధాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విద్యానికేతన్ కాలేజీకి సంబంధించిన అనేక సమస్యల్లో ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని మోహన్ బాబు తన సన్నిహితుల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంపైనా మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాలేజీ సమస్యలకు సంబంధించి ఆయన రోడెక్కడం కూడా జరిగింది.

Nara Chandrababu Naidu : ఏపీలో శ్రీలంక పరిస్ధితులే కనిపిస్తున్నాయి, ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే-చంద్రబాబు

కాగా, అనూహ్యంగా మోహన్ బాబు చంద్రబాబు అపాయింట్ మెంట్ తీసుకోవడం, ఆయనను కలవడం, గంటపాటు సమావేశం కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన, రాజధాని అమరావతి విషయంతో పాటు ఇద్దరిదీ ఒకే జిల్లా కావడంతో చిత్తూరు జిల్లా రాజకీయాలపైనా ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మోహన్ బాబు టీడీపీకి పని చేశారు. ఎన్టీ రామారావు మోహన్ బాబుకి రాజ్యసభ సీటు ఇచ్చారు. అయితే చంద్రబాబుతో విభేదాల కారణంగా ఆయన టీడీపీకి దూరం అయ్యారు. ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబుని కలవడం ఆసక్తికరంగా మారింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

 

ట్రెండింగ్ వార్తలు