Visakha RK Beach: ఆర్కే బీచ్ లో గల్లంతైన యుకులకోసం రెండో రోజు గాలింపు

విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన హైదరాబాద్ యువకుల కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Visakha RK Beach: విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన హైదరాబాద్ యువకుల కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి తెన్నేటి పార్క్ వరకు ఉన్న తీరం వెంబడి సోమవారం నాడు గాలింపు చేపట్టారు. మరో వైపు ఆర్కే బీచ్ వద్ద గజ ఈతగాళ్లు సముద్రంలో గాలిస్తున్నారు. గాలింపు చర్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ లోని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కిష్ణ రెడ్డి వారికి బాసటగా నిలిచారు.

Also read: Ragging Turmoil: సూర్యాపేటలో మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం

హైదరాబాద్ రసూల్ పురా ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు నూతన సంవత్సర వేడుకల నిమిత్తం విశాఖకు వెళ్లారు. ఈక్రమంలో ఆదివారం ఆర్కే బీచ్ వద్దకు వెళ్లిన ముగ్గురు యువకులు అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యారు. ఈఘటనలో సీ.హెచ్ శివ అనే యువకుడు మృతి చెందగా.. గల్లంతైన ఇద్దరు యువకులు కే.శివకుమార్, మహమ్మద్ అజిజ్ ల కోసం సోమవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన మేరకు.. బీజేపీనేత, ఎమ్మెల్సీ మాధవ్ ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు

Also Read: 5 State Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలి: బార్ అసోసియేషన్

ట్రెండింగ్ వార్తలు