Ragging Turmoil: సూర్యాపేటలో మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ కలకలం

సూర్యాపేట మెడికల్ కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.

Ragging Turmoil: దేశంలో ర్యాగింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట మెడికల్ కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన ఒక విద్యార్థి.. సూర్యాపేట మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతున్నాడు. డిసెంబర్ 31న హైదరాబాద్ లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, తిరిగి జనవరి 1న హాస్టల్ కు చేరుకున్న విద్యార్థిని.. 2వ ఏడాది సీనియర్ విద్యార్థులు తీసుకువెళ్లారు. విద్యార్థి బట్టలు విప్పి నగ్నంగా ఫోటోలు వీడియోలు తీశారు.

Also Read: 5 State Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలి: బార్ అసోసియేషన్

అనంతరం ట్రిమ్మింగ్ మిషన్ తో జుట్టు తొలగిస్తుండగా.. భయాందోళనతో విద్యార్థి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని అప్పటికపుడే విద్యార్థి తన తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పగా..వారు 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సూర్యాపేట పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకొని బాధిత విద్యార్థిని సురక్షితంగా తాం వెంట తీసుకువెళ్లారు. ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సూచనల ప్రకారం నడుచుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ర్యాగింగ్ విషయం బయటకు పొక్కడంతో కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థులను ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తున్నారు.

Also Read: Kothagudem News: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య: ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

ట్రెండింగ్ వార్తలు