Chandrababu Naidu Arrest: చంద్రబాబుకు రిమాండ్.. ఏపీ బంద్..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.

Chandrababu Naidu

Tdp Chief Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ కోర్టులో ఆయనకు చుక్కెదురైంది. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. సోమవారం ఏపీ బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Sep 2023 08:44 PM (IST)

    ఇంటి భోజనం కోసం అనుమతి ఇవ్వండి

    చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత ఉందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయన హౌస్ అరెస్టులో ఉండే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. అది కుదరకపోతే ఆయనను ప్రత్యేక జైలుకి తరలించాలని పిటిషన్ వేశారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు.

  • 10 Sep 2023 08:18 PM (IST)

    ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

    చంద్రబాబు నాయుడుకు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది.

  • 10 Sep 2023 07:29 PM (IST)

    కస్టడీకి ఇవ్వండి: సీఐడీ

    చంద్రబాబు నాయుడుని కస్టడీకి కోరుతూ సీఐడీ న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఏసీబీ కోర్టులో అడ్మిట్ అయింది. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

  • 10 Sep 2023 07:28 PM (IST)

    బెయిల్ పిటిషన్ దాఖలు

    చంద్రబాబు నాయుడికి బెయిల్ కోసం ఆయన తరఫున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో అడ్మిట్ అయింది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

  • 10 Sep 2023 07:21 PM (IST)

    ఆంధ్రప్రదేశ్ అంతటా 144 సెక్షన్

    చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

  • 10 Sep 2023 06:49 PM (IST)

    చంద్రబాబుకు రిమాండ్

    చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కు చంద్రబాబును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు. కోర్టు వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.

  • 10 Sep 2023 06:21 PM (IST)

    కోర్టు హాల్ లోపలికి చంద్రబాబు

    న్యాయస్థాన ఆవరణలో వేచి ఉన్న చంద్రబాబు నాయుడు కోర్టు హాల్ లోపలికి వెళ్లారు. తీర్పు చదివేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సిద్ధమయ్యారు.

  • 10 Sep 2023 05:38 PM (IST)

    విజయవాడలో హైటెన్షన్

    విజయవాడలో పోలీసులు భారీగా మోహరించారు. భారీ భద్రత ఏర్పాటు చేస్తుండడంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.

  • 10 Sep 2023 04:41 PM (IST)

    కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసులు

    విజయవాడ కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు పరిసరాలన్నీ పూర్తిగా పోలీసుల పహారాలో ఉన్నాయి. కాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో చంద్రబాబు కోసం కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు.

  • 10 Sep 2023 04:09 PM (IST)

    కాసేపట్లో తీర్పు.. కోర్టుకు సిద్ధార్థ్ లూథ్రా

    చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మరోసారి విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి వాదనలు వినిపించి, మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు నుంచి సిద్ధార్థ్ వెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి కొన్ని పేపర్లతో కోర్టుకు వచ్చారు. కాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు రావడం ఆసక్తికరంగా మారింది.

  • 10 Sep 2023 02:47 PM (IST)

    ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

    విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై కోర్టులో వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై ఉదయం నుంచి వాదనలు కొనసాగాయి.

  • 10 Sep 2023 02:01 PM (IST)

    లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి మొదలైన వాదనలు

    లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు మొదలయ్యాయి. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై లంచ్ బ్రేక్ అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు తిరిగి మొదలయ్యాయి. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్రెడ్డి టీం, చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. వాదనలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా.. మరికాసేపట్లో తీర్పు వస్తుందని అంతా భావిస్తున్నారు. అటు కోర్టు నుంచి బయటకు వస్తూ లూథ్రా విక్టరీ సింబల్ చూపించారు.

     

  • 10 Sep 2023 01:56 PM (IST)

    లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టులో ప్రారంభమైన విచారణ

    లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

  • 10 Sep 2023 01:22 PM (IST)

    ఏసీబీ కోర్టులో లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగనున్న విచారణ. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.

  • 10 Sep 2023 01:07 PM (IST)

    చంద్రబాబు బెయిల్‌పై సస్పెన్స్ ..

    ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టు ఎలాంటి తీర్పుఇస్తుందనే విషయంపై తెలుగు ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 3గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

  • 10 Sep 2023 12:59 PM (IST)

    సెక్షన్ 409, సెక్షన్ 17ఏ పై వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.

  • 10 Sep 2023 12:58 PM (IST)

    గంటపాటు భోజన విరామం..

    ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. కేసు విచారణకు గంటపాటు భోజన విరామం ప్రకటించారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత తిరిగి వాదనలు ప్రారంభం కానున్నాయి.

  • 10 Sep 2023 12:56 PM (IST)

    ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదనలు ముగిశాయి. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే వెంటనే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని లూథ్రా కోర్టును కోరారు.

  • 10 Sep 2023 12:36 PM (IST)

    చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి కావాలి.. ఎందుకు తీసుకోలేదని సీఐడీని ప్రశ్నించిన చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా

  • 10 Sep 2023 12:21 PM (IST)

    విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన వాదనలు. 17ఏ సెక్షన్ పై వాదనలు వినిపిస్తున్న లూథ్రా. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో 15 రోజులు ఉంచుకొని సీఐడీ ఏం చేస్తుందని సిద్ధార్థ లూథ్రా ప్రశ్నించారు. ఇప్పటికే రెండేళ్లుగా ఎక్వరీ చేస్తూనే ఉంది. ఇప్పుడు డబ్బు ఎక్కడికి వెళ్లింది అనేదానిపై విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదని లూథ్రా వాదించారు.

  • 10 Sep 2023 11:54 AM (IST)

    409 సెక్షన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా అన్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని లూథ్రా ఏసీబీ కోర్టును కోరారు.

  • 10 Sep 2023 11:50 AM (IST)

    మరోసారి ఏసీబీ కోర్టులో వాదనలకు విరామం ఇచ్చారు. కోర్టు హాల్ లో ఇరు పక్షాల నుంచి 200 మందికి పైగా ఉండటంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల తరపున 15 మంది మాత్రమే ఉండాలని జడ్జి సూచించారు. దీంతో 15 మందిని మాత్రమే ఉంచి మిగిలిన వారిని కోర్టు హాల్ నుంచి బయటకు పంపించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

  • 10 Sep 2023 11:47 AM (IST)

    విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకు వెళ్లే దారుల్లో రాకపోకలు నిషేధించారు. లాయర్లకు మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్నారు. సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరిని గృహనిర్భందం చేశారు.

  • 10 Sep 2023 10:48 AM (IST)

    విజయవాడ ఏసీబీ కోర్టులో మళ్లీ ప్రారంభమైన వాదనలు

  • 10 Sep 2023 10:23 AM (IST)

    సీఐడీ తరపున వాదనలు పూర్తి. 15 నిమిషాలు విరామం ప్రకటించిన న్యాయమూర్తి. విరామం తరువాత వాదనలు కొనసాగించనున్న చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

  • 10 Sep 2023 10:20 AM (IST)

    సీఐడీ తరపు లాయర్లకు న్యాయమూర్తి సూటి ప్రశ్న..

    చంద్రబాబుపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యమైంది? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయా అని ఏసీబీ కోర్టు జడ్జి సీఐడీ తరపు లాయర్లను ప్రశ్నించారు.

  • 10 Sep 2023 10:18 AM (IST)

    స్కామ్‌లో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకం. 2015లోనే స్కిల్ డవలప్ మెంట్ స్కాం మొదలైంది. ఇప్పటికే 8మందిని అరెస్టు చేశాం. జీవో నెంబర్ 4లో కుట్ర దాగిఉంది. చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని విచారించాలని సీఐడీ తరపున నాయవాది పొన్నవోలు అన్నారు. శనివారం ఉదయం 6గంటలకే చంద్రబాబును అరెస్ట్ చేశాం. 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టామని కోర్టు దృష్టికి పొన్నవోలు తీసుకెళ్లారు.

  • 10 Sep 2023 10:16 AM (IST)

    ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ వాదనలు వినిపించారు. 409 సెక్షన్ పెట్టాలంటే సరైన ఆధారాలు చూపాలి. ఈ సెక్షన్ పెట్టడం సబబు కాదు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలి. 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపర్చాలి. అందుకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు వ్యవహరించారని సిద్ధార్థ లూథ్రా అన్నారు.

  • 10 Sep 2023 08:50 AM (IST)

    ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు..

    తన వాదనలు వినాలని ఏసీబీ కోర్టును చంద్రబాబు కోరారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో.. స్వయంగా తన వాదనలు చంద్రబాబు కోర్టుకు వినిపించారు. తన అరెస్ట్ అక్రమమని, స్కిల్ డెవలప్‌మెంట్  స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని చంద్రబాబు కోర్టుకు విన్నవించారు.

  • 10 Sep 2023 08:38 AM (IST)

    చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ పై ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న విచారణ. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి బృందం

  • 10 Sep 2023 08:35 AM (IST)

    ఏసీబీ కోర్టు వద్దకు భారీగా తరలివస్తున్న టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబును చూసేందుకు కోర్టు వద్ద పడిగాపులు.

  • 10 Sep 2023 08:25 AM (IST)

    చంద్రబాబును 15రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరిన సీఐడీ. కోర్టులో తమ వాదనలు వినిపిస్తున్న ఇరుపక్షాల న్యాయవాదులు.

  • 10 Sep 2023 08:22 AM (IST)

    స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రిమాండ్ రిపోర్టులో లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. సీమెన్స్ సహా ఇతర కంపెనీల ప్రతినిధులు ఇల్లందుల రమేశ్ ద్వారా కలిసిన తర్వాత ఈ ఒప్పందం జరిగిందన్నారు. బాబు, అచ్చెన్నాయుడు కలిసి స్కాం చేశారన్న సీఐడీ.. వివిధ కంపెనీల నుంచి డబ్బు కిలారు రాజేశ్ ద్వారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, పీఏ శ్రీనివాస్‌కు చేరిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

  • 10 Sep 2023 07:44 AM (IST)

    ఏసీబీ కోర్టులో 28 పేజీల రిమాండ్ రిపోర్టును సీఐడీ అధికారులు సమర్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగిన తీరును రిమాండ్ రిపోర్టులో సీఐడీ అధికారులు వివరించారు. కుట్రకు సూత్రధారి చంద్రబాబేనని రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.

  • 10 Sep 2023 07:40 AM (IST)

    ఏసీబీ కోర్టులో 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించిన సీఐడీ అధికారులు

  • 10 Sep 2023 07:37 AM (IST)

    ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే, ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశం ఉత్కంఠ భరితంగా మారింది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా జైలుకు వెళ్లాల్సి వస్తుందా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

  • 10 Sep 2023 06:55 AM (IST)

    ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న ఇరుపక్షాల లాయర్లు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా. సీఐడీ తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు.

  • 10 Sep 2023 06:52 AM (IST)

    3.10am : సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబును జీజీహెచ్ కు తరలింపు.
    3.25am : జీజీహెచ్ ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు.
    3.30am : జీజీహెచ్‌లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ప్రారంభం.
    4.20am : చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.
    4.25am : ఆస్పత్రి నుంచి తిరిగి సిట్ కార్యాలయంకు తరలింపు.
    4.45am : సిట్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.
    5.45am : సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకు చంద్రబాబును తరలింపు.
    6.00am : విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న చంద్రబాబు.
    6.05am : రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన సీఐడీ

  • 10 Sep 2023 06:42 AM (IST)

    ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించిన సీఐడీ అధికారులు. 2021 ఎఫ్ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు. తాజాగా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టు ఇచ్చిన అధికారులు.

  • 10 Sep 2023 06:40 AM (IST)

    ప్రధాన నిందితుడిగా చంద్రబాబు..

    చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చిన సీఐడీ. ఏ37గా ఉన్న చంద్రబాబును ఏ1గా మార్చిన సీఐడీ. అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబును ఏ1 ప్రధాన నిందితుడిగా మార్చిన సీఐడీ.

  • 10 Sep 2023 06:36 AM (IST)

    సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడును పోలీసులు ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు తరపున సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు