Andhra Pradesh : మంత్రి సురేష్‍ను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసింది అందుకే అలా చేశారు : నక్కా ఆనందబాబు

వైఎస్ వివేకా హత్య కేసు గురించి మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని..సురేష్ కామెంట్లపై జగన్.. సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారని  దీంతో జగన్, సజ్జల ఆగ్రహనానికి మంత్రి సురేష్ భయపడి.. ఈ రకంగా వ్యవహరించారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు.

Andhra Pradesh :  ఎర్రగొండ పాలెం ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సురేష్ ను ప్రభుత్వం బ్లాక్ మెయుల్ చేసిందని ఆదిమూలపు సరేష్ తన సహజత్వానికి భిన్నంగా వ్యవహరించారన్నారు. సురేష్ లో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వమే నాటకం ఆడించిందని ఆరోపించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ మెయిల్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే వైఎస్ వివేకా హత్య కేసు గురించి మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని..వైఎస్ వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని సురేష్ ఉన్నమాటే అన్నారంటూ కితాబిచ్చారు. వివేకా విషయంలో సురేష్ కామెంట్లపై జగన్.. సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారని ఈ సందర్బంగా నక్కా ఆనందబాబు గుర్తుచేశారు. దీంతో జగన్, సజ్జల ఆగ్రహనానికి మంత్రి సురేష్ భయపడి.. ఈ రకంగా వ్యవహరించారని సహజంగా ఆయనది అటువంటి స్వభావం కాదన్నారు. సురేష్ స్వభావం చాలా కాలంగా తెలుసని ఆయన అటువంటి వ్యక్తికాదన్నారు.

ఎన్ఎస్జీ ప్రొటెక్షనులో ఉన్న చంద్రబాబుపై దాడి చేయించి కాల్పులకు ప్రేరేపించే ప్రయత్నం మంత్రి ఆదిమూలపు సురేయ్ చేశారని…ఎన్ఎస్జీ కాల్పులు జరిపితే దళితులపై కాల్పులు చేయించారని ప్రచారం చేసుకోవాలని భావించారంటూ ఆరోపించారు. అధికారంలోకి రాగానే తప్పు చేసిన వాళ్లను గుడ్డలూడదీస్తామని మేం చెప్పామని వ్యాఖ్యానించిన నక్కా ఆనందబాబు మేం ప్రతిపక్షంలో ఉండగానే మంత్రులు.. వైసీపీ నేతలు గుడ్డలూడదీసుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

మా ర్యాలీకి అడొచ్చింది కాకుండా మాపైనే విమర్శలు చేస్తారా? మేమే దాడి చేశామని అంటారా?అంటూ ప్రశ్నించారు.దీనికి దళితుల రంగు పులిమే ప్రయత్నం చేస్తు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు.కుట్రలో వైసీపీ, సజ్జల, ఐప్యాక్ టీమ్ భాగస్వాములేనని ..ఈ కుట్రలో దళితులను పావులుగా వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు నక్కా ఆనందబాబు. దళిత ద్రోహీ జగన్ అని దళితులకు ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అంటూ విమర్శించారు. ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేశారని.. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి.. జగన్ తన పేరు పెట్టుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

జగన్ ప్రభుత్వంలో ఎస్సీలను చంపారని..ఎస్ీ మహిళలపై మానభంగాలు చేశారని..శిరోముండనాలు చేయించారని ఇన్ని దారుణాలు జరిగినా నోరెత్తని మంత్రులు,ఎమ్మెల్యేలు.. చంద్రబాబును విమర్శస్తారా? చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు మీకు లేదని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు. నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా దళితులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దళితులపై దాడులు, హత్యలు, మానభంగాలు చేయించిన హీన చరిత్ర వైసీపీదన్నారు. అందుకే వైసీపీ నేతలను దళితులు ఛీ కొడుతున్నారంటూ విమర్శలు సంధించారు.

తన రాజకీయ లబ్ది కోసం సొంత బాబాయినే చంపేసిన వ్యక్తి పోలీసుల్నీ ఏమైనా చేయగలరని అటువంటి వ్యక్తి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పోలీసులు సహకరించకూడదని సూచించారు.
చంద్రబాబు రూటేంటీ..? ఎలా దాడి చేయాలనే అంశంపై స్థానిక డీఎస్పీ సురేషుతో మంతనాలు జరిపారని పక్కా ప్లాన్ ప్రకారం వైసీపీ దాడులకు తెగబడిందని అన్నారు. ఎర్రగొండపాలెంలో నిన్న జరిగిన ఘటనకు మంత్రి ఆదిమూలపు సురేషుకు సిగ్గుండాలి.. చంద్రబాబు వస్తుంటే అక్కడ మీరు ఎందుకున్నారు..? మీరు మంత్రి స్థాయిలో ఉన్నవిషయం మర్చిపోయారా? అంటూ ఎద్దేవా చేశారు.

ఇన్ని చేసి తగుదునమ్మా అంటూ మంత్రి సురేష్ ప్రెస్ మీట్ పెడతారా..? ప్రణాళిక ప్రకారం ఎస్సీ నియోజకవర్గంలోనే చంద్రబాబుపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.ఏదైనా జరగరానిది జరిగితే దళితులపై దాడులంటూ వైసీపీ రోడ్డెక్కాలని ప్లాన్ వేసిందని దాంట్లో భాగంగానే నిన్న జరిగిన ఘటనలుఅంటూ మండిపడ్డారు. వైసీపీకి కంచుకోటల్లాంటి ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గాల్లో చంద్రబాబు టూర్ సూపర్ సక్సెస్ అయిందని అది చూసి ఓర్వలేక వైసీపీ దాడులకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబు టూర్ సక్సెస్ కావడంతో ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు టూర్ పై దాడికి కుట్ర చేశారని నక్కా ఆనందబాబు విమర్శించారు.







                                    

ట్రెండింగ్ వార్తలు