Ippatam Demolition: ఇప్పటంలో ఉద్రిక్తత.. మళ్లీ మొదలైన కూల్చివేతలు.. అడ్డుకున్న గ్రామస్తులు.. భారీగా పోలీసుల మోహరింపు

ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవ్వడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.

Ippatam Demolition: ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవ్వడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. మా ఇళ్ల జోలికివస్తే మేం ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే గ్రామంలో రోడ్డు విస్తరణ నేపథ్యంలో 90శాతం ఇళ్లను కూల్చివేశారు. మిగిలిన కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. రెండు జేసీబీల సహాయంతో పన్నెండు ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చివేశారు.

Pawan Kalyan Ippatam : ఇంటికో లక్ష రూపాయలు.. ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

ఇప్పటం జనసేన పార్టీ అధ్యక్షుడు నరసింహారావు నివాసాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ప్రవారీ వరకు కూల్చివేశారు. ఇదిలాఉంటే ఇప్పటం గ్రామస్తురాలు ఇండ్ల లక్ష్మి మాట్లాడుతూ.. జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చినందుకు మా ఇల్లు కూల్చివేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా మమ్మల్ని అధికారులు టార్చర్ పెడుతున్నారని, మాకు తిండి లేదు, నిద్ర లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేము స్వచ్ఛందంగా ఇల్లు ఇచ్చామని అధికారులు అబద్ధాలు చెప్తున్నారని, అలాంటి వాదనల్లో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం‌లో రావణ కాష్టం జరుగుతుందని, అధికారులు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం ఇల్లు తొలగించారని, ఇప్పుడు ఆ మార్కింగ్ దాటి ఇల్లు తొలగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇళ్ల జోలికి వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని, మా శవం మీద నుంచి జేసీబీ తీసుకువెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలాఉంటే, ఇప్పటంకు జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. గోడలకు అధికారులు వేసిన మార్కింగ్ లు తొలగించి వేస్తున్నారు.

Ippatam Incident: బుద్ధి ఉందా.. మేం ఏమైనా గూండాలమా..?: పవన్

ఇప్పటం గ్రామంకు గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులకు బుద్ది లేదా..? మార్కింగ్ తప్పు ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు. గత సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చారని ఇక్కడ ఇల్లు కూల్చివేశారని, ఇప్పుడు మచిలీపట్నం‌లో ఆవిర్భావ సభ ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కూడా రోడ్డు విస్తరణ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇవ్వటమే ఇక్కడ రైతులు చేసిన పాపమా? అంటూ ప్రశ్నించారు. మేము అధికారుల మీద నష్టపరిహారం కేసు వేస్తామని అన్నారు. తాడేపల్లి కొంప‌లో ఉంటున్న ముఖ్యమంత్రికి కుల్చివేయాడం తప్ప ఏమీ రాదని, ప్రజావేదిక కూల్చారు అది ఏమైనా మీ బాబు సొమ్మా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఇప్పటం‌లో ఇళ్లు కుల్చుతున్నారు ఎవరి సొమ్ము అని కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన పిఏసి మెంబర్ బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేవలం గత సంవత్సరం జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చిన కారణంగా ఇప్పటం లో మళ్ళీ ఇల్లు కూల్చివేస్తున్నారని అన్నారు. గతంలో ఒకసారి ఇల్లు కూల్చారని, ఇప్పుడు మళ్లీ మేము వేసిన మార్కింగ్ తప్పు అంటూ అధికారులు కుల్చివేయడం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారని, నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి మా అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం లో పర్యటిస్తారని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Pawan Kalyan: వైసీపీ గడప కూల్చేవరకు జనసేన నిద్రపోదు.. ఇప్పటం కూల్చివేతల వెనుక సజ్జల పాత్ర

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో గతంలో మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణకోసం ఇళ్లు, ప్రహరీలను కూల్చివేశారు. ఆ సమయంలోనూ ఉద్రిక్తత కనిపించింది. అయితే, ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం వాసులను పరామర్శించారు. జనసేప పార్టీ తరపున వారికి అండగా నిలిచారు. కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థికంగా సాయంకూడా అందించారు. ఇప్పుడు మరోసారి ఇళ్లు కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు