AP Cabinet : ఏపీ కేబినెట్‌ విస్తరణకు కౌంట్‌డౌన్..ఏప్రిల్‌ 7న మంత్రివర్గం భేటీ..తేలిపోనున్న సిట్టింగ్‌ మంత్రుల భవితవ్యం

ఏప్రిల్ 7న కేబినెట్‌ భేటీ కానుంది. అదే రోజు సిట్టింగ్‌ మంత్రుల భవిష్యత్‌ తేలిపోతుందనే చర్చ నడుస్తోంది. కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై క్లారిటీ రానుంది.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని తెలుస్తుండటంతో అటు మంత్రుల్లో.. ఇటు ఆశావహుల్లో మరింత టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ 7న కేబినెట్‌ భేటీ కానుంది. అదే రోజు సిట్టింగ్‌ మంత్రుల భవిష్యత్‌ తేలిపోతుందనే చర్చ నడుస్తోంది. కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై అదే రోజు క్లారిటీ రానుంది.

కొత్త మంత్రివర్గంలో కేవలం ఇద్దరు లేదా.. ముగ్గురు పాత మంత్రలు మాత్రమే ఉంటారని ఇప్పటికే సీఎం జగన్‌ క్లారిటీ ఇచ్చారు. 95 శాతం కొత్త కేబినెట్‌ ఏపీలో కొలువుదీరనుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే.. జగన్‌ కేబినెట్‌లో మరో రెండేళ్లు కొనసాగే ఆ ఇద్దరు.. ముగ్గురు మంత్రులు ఎవరు…? ఎవరిని సిట్టింగ్‌లుగా కంటిన్యూ చేస్తారని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

మరోవైపు.. అన్ని జిల్లాల నుంచి ఆశావహులు భారీగానే కేబినెట్‌లో స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. తమ సీనియారిటీ, కులాల ప్రాతిపదికన.. ఈ సారైనా తమకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక కొందరేమో.. తమకు కేబినెట్‌లో బెర్త్‌ కన్ఫామ్ అంటూ దీమాగా ఉన్నాయి. అయితే.. వీటన్నింటికీ ఏప్రిల్‌ 7న ఎండ్‌కార్డ్‌ పడుతుందని.. అదే రోజు కొత్త మంత్రివర్గంలో ఎవరు ఇన్‌.. ఎవరు ఔట్ అనేది తేలిపోతుందని తెలుస్తోంది.,

కొత్త మంత్రులకు ఒక రోజు ముందుగా మాత్రమే సమాచారం ఇవ్వనున్నారు. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ డేట్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా ఫిక్స్‌ అయినట్టేనని సమాచారం. సీఎం జగన్‌ తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారని తెలిసిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మంత్రులు అందర్నీ తప్పిస్తారని మొదట్లో భావించారు. కొన్ని సమీకరణల దృష్ట్యా కొందరిని కొనసాగించాలని తర్వాత నిర్ణయించారు.

AP Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు?

పదవి నుంచి తప్పుకునే కొందరు మంత్రులకు రీజినల్‌ ఇన్‌చార్జి పదవులు ఇవ్వనున్నారు. మిగిలిన వారికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారు. రాజకీయ, ప్రాంతీయ, సామాజికవర్గ సమీకరణాలను బ్యాలెన్స్‌ చేస్తూ కొత్త మంత్రుల ఎంపికపై జగన్‌ కసరత్తు చేశారని సమాచారం. మంత్రి పదవుల కోసం ఆశావహులు చాలామందే ఉన్నారు. దాంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు