Krishna District : అప్పుల బాధతో చేనేత కుటుంబం ఆత్మహత్య

కృష్ణాజిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పెడన 17 వ వార్డుకు చెందిన చేనేత  కార్మికుడు  కాశం పద్మనాభం(52), భార్య నాగ లీలావతి(45

Krishna District :  కృష్ణాజిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పెడన 17 వ వార్డుకు చెందిన చేనేత  కార్మికుడు  కాశం పద్మనాభం(52), భార్య నాగ లీలావతి(45), వారి కుమారుడు రాజానాగేంద్ర(24) లు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

పద్మనాభం పెడనకు చెందిన ఒక వ్యక్తి వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందుకు గాను అప్పు ఇచ్చిన వ్యక్తి అధిక వడ్డీవేసి రూ.4 లక్షల 50 వేల రూపాయలకు … బాధితుడిపై ఒత్తిడి చేసి నోట్లు, అగ్రిమెంట్లు రాయించుకుని నోటరీ చేయించుకున్నట్లు తెలిసింది.  అనంతరం అప్పు ఇచ్చిన వ్యక్తి   బెదిరింపులకు పాల్పడటంతో  పద్మనాభం తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలిసింది. దీంతో  పద్మనాభం కుటుంబంతో సహా ఆత్మహత్యచేసుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం తెలిసిన వెంటనే పెడన ఎస్ఐ ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాలను పోస్టు‌మార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా….. ప్రభుత్వ   విధానాలతోనే   చేనేత కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని   టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.   ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజల్ని ఉద్ధరించటంలేదని ఆయన విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నేతన్నలకు అందించిన అనేక పధకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిందని అన్నారు.
Also Read : India Covid-19 Update : దేశంలో కొత్తగా 1,67,059 కోవిడ్ కేసులు నమోదు
అతి ప్రచారం, అసమర్ధ పాలనతోనే చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. పెడన చేనేత కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యతవహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు