TTD-Annamaya: అన్నమయ్యను అగౌరపరుస్తున్నామన్న వార్తలు అసత్యం, టీటీడీపై దుష్ప్రచారం తగదు: ఎఇఓ ధర్మారెడ్డి

అన్నమయ్యను అగౌరపరుస్తున్నామంటూ కొందరు పనిగట్టుకుని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

TTD-Annamaya: అన్నమయ్యను అగౌరపరుస్తున్నామంటూ కొందరు పనిగట్టుకుని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలలో మాట్లాడిన ఆయన..ఇటీవల దేవస్థానంలో వచ్చిన పలు ఆరోపణలపై వివరణ ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ, కళ్యాణోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. అన్నమయ్య వంశీకులుకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా వస్తూన్న గౌరవ మర్యదాలు కల్పిస్తూన్నామని ధర్మారెడ్డి వివరించారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రతి ఏటా రూ.25 కోట్లు కేటాయిస్తూన్నట్లు ఆయన వివరించారు.14,900 అన్నమయ్య కీర్తనలు ప్రస్తూతం అందుభాటులో వున్నాయని..వాటిలో 4400 కీర్తనలును ఇప్పటి వరకు స్వరపర్చగా..మరో వెయ్యి కీర్తనలు స్వరపర్చే కార్యక్రమాని ప్రారంభించినట్లు ధర్మారెడ్డి వివరించారు.

Also read:Yash : తిరుపతి ప్రెస్‌మీట్‌లో రాకింగ్ స్టార్ యశ్

25 మంది పండితులతో టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనల పై పరిశోధన నిర్వహిస్తూన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఏటా అన్నమయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను టీటీడీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. అన్నమయ్య జన్మస్థానం తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాని ఏర్పాటు చేశామని, ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాకు అన్నమయ్య జిల్లాగా నామకరణం చేశారని టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక తిరుమల కొండపై మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నాలుగు మాఢవీధులలో ఉన్న మఠాలతో పాటు స్థానికుల నివాసాలను తొలగించి..ప్రత్యామ్నాయ ప్రదేశాలలో బాధితులకు పునరావాసం కల్పించినట్లు ధర్మారెడ్డి వివరించారు. టీటీడీ భక్తుల సౌకర్యార్ధం తగిన ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తుందని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Also read:Bhumana Followers Resign : వైసీపీలో కేబినెట్ చిచ్చు.. తిరుపతిని తాకిన అసమ్మతి సెగ, పదవులకు రాజీనామా

ట్రెండింగ్ వార్తలు