Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు

టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి దగ్గర అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు. ఇది టీటీడీ ఎన్నో ద‌శాబ్దాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌.

Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. భక్తులు అన్యమత ప్రచార సామగ్రిని, వ్యక్తుల ఫోటోలను తిరుమలకు తీసుకెళ్లడంపై టీటీడీ నిషేధం విధించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వచ్చే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రిని తిరుమ‌లకు తీసుకెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది.

TTD Condemns Paripoornananda Allegations : ఆర్జిత సేవలపై పరిపూర్ణానంద ఆరోపణలు అవాస్తవం-టీటీడీ

టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి దగ్గర అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు. ఇది టీటీడీ ఎన్నో ద‌శాబ్దాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌. ఇటీవల కాలంలో తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది.

TTD Bans Them, Alert For Devotees Coming To Tirumala

 

విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేయడం జరుగుతోంది. ఈ క్రమంలో భక్తులకు అవగాహన కల్పించే ప్రయత్నం టీటీడీ చేసింది. వాటిపై నిషేధం ఉన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. కావున, వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి తమ సిబ్బందికి స‌హ‌క‌రించాల్సిందిగా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

క‌లియుగ దైవం శ్రీవేంకటేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమ‌ల. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వస్తుంటారు. రోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తారు. శ్రీవారిని కనులారా వీక్షించి తరించిపోతారు. అలాంటి పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కొన్ని నిబంధనలు పెట్టింది. భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంది. అన్యమత ప్రచారం, సామాగ్రిపై నిషేధం విధించింది. దైవ దర్శనానికి వచ్చే భక్తులందరిని సమానంగానే చూస్తోంది.

కాగా, తొలిసారిగా తిరుమలలో హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే తొలిసారిగా నిర్వ‌హించ‌నున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు ఈ నెల 25 నుంచి 29 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు శ‌నివారం టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

TTD Temple: శాస్త్రోక్తంగా శ్రీ‌వారి మెట్టు న‌డ‌క‌దారి పునఃప్రారంభం

తిరుమ‌ల కొండ‌పై అంజ‌నాద్రి, జాపాలి, నాద నీరాజ‌న వేదిక‌, వేద పాఠ‌శాల‌ల్లో ఈ వేడుక‌లను నిర్వ‌హించనున్న‌ట్లు ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను ఆయ‌న శ‌నివారం ప‌రిశీలించారు. ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేలా ప‌క‌డ్బందీగా ఏర్పాట్ల‌ను చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

 

ట్రెండింగ్ వార్తలు