Tirumala: టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు.. గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్ దర్శనం.. కేవలం వారికి మాత్రమే.. చేతికర్రలు కూడా..

సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.

TTD

Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తికి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానమైంది.. గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్ దర్శనం. చిన్నతనం నుంచే యువతలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 25ఏళ్లలోపు యువత కోటి గోవింద నామాలు పూర్తిచేస్తే.. వారి కుటుంబానికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. యువతీ లేదా యువకుడు 10,01,116 సార్లు గోవింద నామాలు‌ రాస్తే ఆ వ్యక్తికి స్వామివారి బ్రేక్ దర్శనం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా 20 పేజీలున్న కోటి భగవద్గీత పుస్తకాలు శ్రీవారి ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.

TTD Brahmotsavam : సెప్టెంబరు 18 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు విడుదల చేసిన టీటీడీ చైర్మన్, ఈఓ

నడక మార్గంలో ఎనిమిది వేల చేతికర్రలు..
తిరుపతి కొండపైకి వెళ్లే నకడ మార్గంలో భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై చిరుత పులి దాడిచేసి హతమార్చిన విషయం విధితమే. ఆ తరువాత టీటీడీ, అటవీశాఖ అధికారులు నాలుగు చిరుత పులులను బంధించారు. ఇంకా మరికొన్ని చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నట్లు భక్తులు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇటీవలికాలంలో నడకమార్గంలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది.

నడకమార్గంలో ప్రయాణించేవారికోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పటిష్ట భద్రతను కల్పిస్తోంది. దీనికితోడు నడకమార్గంలో ప్రయాణించే ప్రతీఒక్కరికి చేతికర్రలు అందిస్తుంది. ఈ కర్రలు చేతిలో ఉంటే చిరుత, ఎలుగుబంటి వంటి క్రూరమృగాలు వచ్చినప్పుడు తరిమికొట్టేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది. ఈ క్రమంలో నడక మార్గంలో భక్తులకు చేతికర్రలు ఇచ్చి, ఎన్ఎస్ ఆలయం వద్ద తిరిగి తీసుకుంటామని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ చేతికర్రలు బుధవారం నుంచి అందుబాటులోకి వస్తాయని అన్నారు.

Tirumala: అలా చేయొద్దు.. తిరుమల కొండపైకి నడక మార్గంలో ప్రయాణించే భక్తులకు టీటీడీ కీలక సూచన..

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ..
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. టీటీడీ చైర్మన్ గా, రాజకీయ నేతగా చెబుతున్నా.. సనాతన ధర్మం అంటే మతంకాదు. అది ఒక జీవనయానం. ప్రతి దేశానికి ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. వాటిని అర్ధం చేసుకోకుండా విమర్శించడం సరికాదు. ఇవి సమాజంలో అలజడిని సృష్టించడానికి పనికొస్తాయి తప్ప విమర్శించిన వాళ్లకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అని భూమన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు