MLA Mekapati Chandrasekhar Reddy : ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది-వైసీపీ నుంచి సస్పెన్షన్‌పై ఎమ్మెల్యే మేకపాటి సంచలన వ్యాఖ్యలు

నాడు జగన్ తో పాటు కలిసి నడిచాము. డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. వాళ్లతో ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించ లేదు. మాతోనే అమర్యాదగా ప్రవర్తించారు.

MLA Mekapati Chandrasekhar Reddy : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ)లను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఆ నలుగురిపై చర్యలు తీసుకున్నట్టు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. సస్పెన్షన్ నిర్ణయంపై స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు బరువు దిగిపోయిందని, తనకు చాలా హ్యాపీగా ఉందని ఆయన అన్నారు. తనను సస్పెండ్‌ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. వైసీపీ నిర్ణయంతో చాలా రిలాక్స్‌గా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ప్రకటించి, ఇన్నాళ్లూ ఆయన వెంట నడిచినందుకు తనను ఘనంగా సత్కరించారని ఎమ్మెల్యే మేకపాటి విమర్శించారు.(MLA Mekapati Chandrasekhar Reddy)

Also Read..YCP MLAs: ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’పై సస్పెన్షన్ వేటు.. వెల్లడించిన సజ్జల

”నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అధికారాన్ని వదులుకుని జగన్ మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాను. జగన్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలియకుండా మేము అప్పుడు నమ్మి వెళ్ళాము. నాడు జగన్ తో పాటు కలిసి నడిచాము. డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. వాళ్లతో ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించ లేదు. మాతోనే అమర్యాదగా ప్రవర్తించారు. మా గురించి తక్కువగా అంచనా వేశారు. నా నియోజకవర్గంలోకి నా వ్యతిరేకులను పంపి నన్ను అవమానాలపాలు చేశారు. ఈ పార్టీలో ఇక వేగడం కష్టమే అని భావిస్తున్న తరుణంలో నన్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది” అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Also Read..Vishnu Kumar Raju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తప్పుచేశారు..! ఈసారి వైసీపీ గెలుపు అసాధ్యం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్ కు ఝలక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. పంచుమర్తి అనురాధకు అత్యధికంగా 23 ఓట్లు వచ్చాయి. దీన్ని వైసీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వీరిపై చర్యలు తీసుకున్నట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Also Read..Vallabaneni Vamshi: మా ఎక్స్‌ బాస్‌ కొనుగోలు విషయంలో ఎక్స్‌పర్ట్.. ప్రజాక్షేత్రంలో వైసీపీదే విజయం

”చంద్రబాబు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల వరకు ఇచ్చి కొన్నారు. ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టమే. రోగ కారకాన్ని తక్షణమే గుర్తించి ఇలాంటి వాటిని తొలగించుకోవాలి. అందుకే మా పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరమనే సస్పెండ్ చేశారు. కేవలం అసంతృప్తి వల్లే ఎవరూ బయటికి వెళ్లరు. ప్రలోభపెట్టడం వల్లే మా వాళ్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. టీడీపీ నేతలు మాపై అభిమానంతో వచ్చారు. ఆ పార్టీలో అసంతృప్తి వల్లే వారు బయటికి వచ్చారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

ట్రెండింగ్ వార్తలు