Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో తిరుమల తరహా భద్రత

తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Ayodhya Ram Temple: దేశ ప్రజలు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామ మందిరం పూర్తయితే భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఒక్కసారి ఆలయం తెరిచిన తరువాత నిత్యం లక్షలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. ఈక్రమంలో ఆలయం మరియు భక్తుల భద్రతకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అందుకోసం దేశంలోనే అత్యధిక మంది భక్తులు దర్శించుకునే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయ భద్రతపై అధ్యయనం చేయనున్నారు. తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Also read: Corona Omicron : ఒమిక్రాన్ ఎందుకంత వేగంగా విస్తరిస్తుందో తెలిసింది

తిరుమల ఆలయ భద్రత పై అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసుల బృదం బుధవారం తిరుమల చేరుకున్నారు. యూపీ డీఐజీ సుభాష్ చంద్ర దోబే, వినోద్ కె సింగ్ ఆద్వర్యంలోని పోలీసుల బృందం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో సమావేశం అయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టిటిడి ముఖ్య భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి.. యూపీ పోలీసులకు.. తిరుమలలో తీసుకునే భద్రత వివరాలు వెల్లడించారు.

Also read: Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?

తిరుమల కొండ దిగువున అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహన తనిఖీలు, నిషేధిత వస్తువులు, పదార్థాలు కొండపైకి వెళ్లకుండా కట్టడి, నడక మార్గంలో తనిఖీలు, క్యూ లైన్ మేనేజ్మెంట్, ఆక్టోపస్, బాంబు, డాగ్ స్క్వాడ్ పహారా, ఆలయంలోకి వెళ్లే భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం తదితర అంశాల గురించి..ఎస్పీ వెంకట అప్పలనాయుడు.. యూపీ పోలీసులకు వివరించారు. ఇదే తరహా భద్రతా చర్యలు అయోధ్యలోనూ అమలు చేయనున్నట్లు యూపి పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

Also read: Governor Tamilisai: సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లాకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక అభినందనలు

ట్రెండింగ్ వార్తలు