Ambati Rambabu : పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా

ఎన్టీఆర్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా చేయలేదు. Ambati Rambabu

Ambati Rambabu Movie On Pawan Kalyan

Ambati Rambabu – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan), ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బ్రో సినిమాలో(Bro Movie) శ్యాంబాబు పాత్ర(ShyamBabu) వివాదానికి కారణమైంది. ఈ ఇద్దరి మధ్య చిచ్చు రాజేసింది. పవన్ కల్యాణ్ కావాలనే తనను కించపరిచే విధంగా సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేశారని అంబటి రాంబాబు ఫైర్ అవుతున్నారు. దీనిపై ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు.

పవన్‌ కల్యాణ్ పూర్తి స్థాయి పొలిటికల్‌ సినిమా తీసుంటే అందులో తప్పు లేదు. కానీ, ఒక కమర్షియల్‌ సినిమాలో కావాలని ఒక పాత్రను సృష్టించి నాపై కక్ష తీర్చుకోవాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ పై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. పలు టైటిల్స్ పేర్లు కూడా ఆయన అనౌన్స్ చేశారు.(Ambati Rambabu)

‘‘ఎన్టీఆర్‌ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా చేయలేదు. చిరంజీవి కూడా పాలిటిక్స్ లో ఉండగా మూవీస్ చేయలేదు. కానీ, పవన్‌ కల్యాణ్‌ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు చేస్తున్నారు. సినీ రంగంలో హీరోగా రాణించి, మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి కథతో మేము కూడా సినిమా చేయాలనుకుంటున్నాం. వాటికి ‘నిత్య పెళ్లి కొడుకు’, ‘బహు భార్య ప్రావీణ్యుడు’, ‘పెళ్లిళ్లు పెటాకులు’, ‘తాళి-ఎగతాళి’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’, బ్రో లాగా మ్రో (మ్యారేజస్‌, రిలేషన్స్‌, అఫెండర్‌) ఇలా టైటిల్స్‌ అనుకుంటున్నాం. పేరు పెట్టాక అందరికీ చెబుతాం” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Also Read..Srikakulam: శ్రీకాకుళంలో టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ సూపర్ ప్లాన్!

”పవన్ నటించిన బ్రో మూవీ బాక్సాఫీసు దగ్గర అద్భుతంగా రాణిస్తోందని సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో పాటు సక్సెస్ మీట్‌లు కూడా పెట్టుకుంటున్నారు. కానీ, అసలు నిజం ఏంటంటే.. బ్రో అట్టర్ ఫ్లాప్ మూవీ, డిజాస్టర్. ఆధారాలు లేకుండా నేను చెప్పడం లేదు. నిన్నటి వరకు ఈ సినిమా రూ.55.20 కోట్ల షేర్ వసూలు చేసింది. నిన్న కలెక్షన్ చాలా దారుణంగా పడిపోయింది. రూ.2.3 కోట్ల మేర షేర్ వచ్చింది. మొత్తంగా రూ.70 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. అందుకే, మళ్లీ కాంట్రవర్సీ చేసి కలెక్షన్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ శ్యాంబాబు పాత్ర ద్వారా మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటల వద్ద లంబాడి మహిళలతో కలిసి అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తూ శ్యాంబాబు పాత్ర ద్వారా మంత్రి అంబటిని కించపరిచారని ప్రచారం జరుగుతోంది.

Also Read..Proddatur Constituency: ప్రొద్దుటూరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. జోరుచూపిస్తున్న టీడీపీ..

ట్రెండింగ్ వార్తలు