Anil Kumar Yadav : పోటీకి నేను రెడీ, నా గెలుపుని ఆపు చూద్దాం.. లోకేశ్ కు అనిల్ సవాల్

నా కుటుంబానికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను..కానీ నువ్వు నీ తాత, తండ్రీ సీఎంలుగా పనిచేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు.2024 ఎన్నికల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

anil kumar yadav nara lokesh

Anil Kumar Yadav – Nellore Politics : నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో భాగంగా ఏ జిల్లాలో యాత్ర చేస్తుంటే ఆ ప్రాంత వైసీపీ(YCP) నేతను టార్గెట్ గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నెల్లూరు జిల్లా (Nellore District)లో పాదయాత్ర (Padayatra) కొనసాగుతున్న క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు, ఆరోపణలు చేశారు. వీటిపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. లోకేశ్ విమర్శలకు కౌంట్ ఇస్తునే సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో నా గెలుపును ఆపు చూద్దాం.. నెల్లూరు సిటీ (Nellore City)లో నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు.

Vangaveeti Radhakrishna : ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు.. ప్రజల కోసం ఏం చేశాన్నమదే లెక్క- వంగవీటి రాధా

నా కుటుంబానికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను.. కానీ నువ్వు నీ తాత, తండ్రీ సీఎంలుగా పనిచేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో నేను పోటీ చేస్తా.. నన్ను గెలవకుండా నువ్వు చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అని సవాల్ విసిరారు. నన్ను ఓడించటానికి టీడీపీ రూ.200లకోట్లు రెడీ చేసుకుంటోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్ యాదవ్.

Also Read: నాకు హీరోలందరూ ఎందుకు ఇష్టం అంటే? ఇవాళ మహేశ్ బాబు ఫ్యాన్ నన్ను కలిసి..?: పవన్ కల్యాణ్

లోకేశ్ పై విమర్శలు చేస్తు.. సవాళ్లు విసిరిని అనిల్ కుమార్ మరోవైపు ఆనంద రామనారాయణ రెడ్డి పై కూడా మండిపడ్డారు. జగన్ వద్ద నాకు ప్రత్యేకంగా మెప్పు పొందాల్సిన అవసరం లేదని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ వ్యక్తి ప్రాపకం కోసం ఆనం పాకులాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. 80 ఏళ్ల చరిత్ర ఉన్న కుటుంబ పరువును ఆనం.. లోకేష్ కాళ్ళ ముందు పెట్టారని మండిపడ్డారు. కాగా వైసీపీ నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు