Adala Prabhakar Reddy : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరతారు అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యలు. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆదాల ఏమన్నారంటే..

Adala Prabhakar Reddy.. Somireddy  chandramohan reddy

YCP MP Adala Prabhakar Reddy : వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ నేత (TDP Leader) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy  chandramohan reddy) చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఆదాల కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి చెందిన ఓ ఎంపీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని.. నెల్లూరు టీడీపీ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డి త్వరలో టీడీపీలో చేరబోతున్నారు అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టిడిపి ((TDP) మైండ్ గేమ్ ఆడుతోందని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని స్పష్టంచేశారు.

తాను టీడీపీలో చేరతాను అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని.. సోమిరెడ్డి అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు ఎంపీ ఆదాల. వైసీపీ నెల్లూరు రూరల్ (party change) అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని తెలిసిన వెంటనే ఒక పథకం ప్రకారం టీడీపీ గోబెల్ ప్రచారo చేస్తోంది అంటూ మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలు ఎవరు ఈ ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. సీఎం జగన్ ఎంతో నమ్మకంతో తనను నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ప్రకటించారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడించారున. జగన్ తనపై పెట్టిన నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోను వదులుకోనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ రూరల్ అభ్యర్థిగానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి.

Somireddy Chandra Mohan Reddy : టీడీపీలోకి మరో నెల్లూరు వైసీపీ నేత? సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా.. నెల్లూరు నుంచి ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి వంటి అధికార పార్టీ నేతలు టీడీపీలో చేరారు. ఇక నెల్లూరు నుంచి మరింత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరు టీడీపీ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొంతకాలం క్రితం తాను, ఆదాల ప్రభాకర రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక ఫంక్షన్ లో కలుసుకున్నప్పుడు రాజకీయ పరిస్థితులపై చాలాసేపు మాట్లాడుకున్నామని.. త్వరలోనే ఆదాల మన పార్టీలోకి వస్తారంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదాల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వైసీపీని వీడేది లేదు.. జగన్ నమ్మకాన్ని కాపాడుకుంటానంటూ స్పష్టంచేశారు.

ట్రెండింగ్ వార్తలు