Kia EV5 electric SUV : 2023 కియా ఈవీ డే.. కొత్త ఈవీ EV5 SUV కారు అదుర్స్.. ఈ కారులో ఫ్రిడ్జ్, సీట్లను బెడ్ రూమ్‌గా మార్చుకోవచ్చు..!

2023 Kia EV Day : 2023 కియా ఈవీ డే సందర్భంగా సరికొత్త టెక్నాలజీతో కాన్సెప్ట్ ఈవీ (EV5) కారును ఆవిష్కరించింది. ఈ కారులో ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేలు, 12.3-అంగుళాల రెండు స్క్రీన్‌లు, బ్యాక్ సీట్ బెడ్ రూంగా మార్చుకోవచ్చు. ఫుడ్ స్టోర్ కోసం 4-లీటర్ రిఫ్రిజిరేటర్ వార్మింగ్ యూనిట్ కూడా ఉంది.

2023 Kia EV Day _ Kia’s new EV range includes cars that can turn into bedrooms

Kia EV5 electric SUV : ప్రముఖ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో ఆధిపత్యం కోసం దక్షిణ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్-యుటిలిటీ వెహికల్ కియా మోటార్స్ (Kia Motors) అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లను అధికారికంగా ఆవిష్కరించింది. చైనాలో 2023 కియా ఈవీ డే (2023 Kia EV Day) ఈవెంట్ సందర్భంగా మిలీనియల్ కుటుంబాల కోసం రూపొందించిన EV5 SUV  (Kia EV5 electric SUV) కారును ప్రవేశపెట్టింది. కియా ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్‌ను కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV, రెండు కాన్సెప్ట్ EVలతో విస్తరించింది. అందులో EV5 కాంపాక్ట్ SUV కారుతో పాటు రెండు కాన్సెప్ట్ EV3 (SUV), EV 4 (సెడాన్)లను కూడా కంపెనీ ఆవిష్కరించింది.

Kia EV5 electric SUV

గంట ఛార్జింగ్‌తో 530 కిలోమీటర్ల పరిధి :
ఇప్పటికే కియా రెండు కాన్సెప్ట్ EVలను ఆవిష్కరించింది. ఎందుకంటే.. బడ్జెట్ కాన్షియస్ డ్రైవర్‌లను ఆకర్షించడానికి చౌకైన మోడళ్ల శ్రేణిని రూపొందించింది. చైనీస్ మార్కెట్ కోసం ప్రామాణిక మోడల్ 64kWh-గంట బ్యాటరీతో 530 కిలోమీటర్ల (330 మైళ్లు) పరిధిని అందిస్తుంది. అయితే, లాంగ్-రేంజ్ మోడల్ 88kWh బ్యాటరీ ఛార్జ్‌కు 720 కిలోమీటర్లు అందిస్తుంది. కొరియన్ మోడల్‌లు కొంచెం చిన్న బ్యాటరీలను కలిగి ఉంటాయని డ్రైవింగ్ రేంజ్ మార్కెట్ డిమాండ్‌లకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Kia EV5 electric SUV Car Seat as Bedroom

సీట్లను మడిచి బెడ్ రూం మార్చుకోవచ్చు :
EV5 ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేలు, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం రెండు 12.3-అంగుళాల (31-సెంటీమీటర్) స్క్రీన్‌లు, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేతో వస్తుంది. చైనీస్ వెర్షన్‌లో ఫ్రంట్ బెంచ్ సీటు ఉంటుంది. అయితే, బ్యాక్ సీటును ఫ్లాట్‌గా మడిచి బెడ్‌గా మార్చవచ్చు. అంతేకాదు.. ఆహారం, పానీయాలను స్టోర్ చేయడానికి 4-లీటర్ (1.1 గాలన్) రిఫ్రిజిరేటర్, వార్మింగ్ యూనిట్ కూడా ఉంది. ఈ కార్లు చైనా, కొరియాలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యాయి. ఈ కార్ల ఉత్పత్తి 2025 నాటికి ప్రారంభమవుతుంది. కియా మరో రెండు కాన్సెప్ట్ కార్లను కూడా ప్రదర్శించింది.

Read Also : Hyundai Creta SUV 2024 : కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ క్రెటా వచ్చేస్తోంది.. 2024 లాంచ్ డేట్, ధర, ఫీచర్లు, డిజైన్ పూర్తి వివరాలు మీకోసం..

అందులో EV3, ఫ్లాగ్‌షిప్ EV9 కాంపాక్ట్ వెర్షన్, EV4 మాత్రం స్పోర్ట్స్ కారు మాదిరిగా కనిపించే నాలుగు-డోర్ల సెడాన్. బ్యాటరీతో నడిచే కార్లను వేగవంతం చేసేందుకు 35వేల డాలర్ల నుంచి 50వేల డాలర్ల వరకు ధరలో చిన్న EVలను ప్రవేశపెట్టాలని కియా నిర్ణయించింది. ఆ ప్రణాళికలో భాగంగానే ఈ మూడు మోడల్‌లను ఆవిష్కరించినట్టు కంపెనీ తెలిపింది. టాప్-ఎండ్ మోడల్స్ 80వేల డాలర్ల వరకు ఉంటాయి. కియా గత నెలలో చౌకైన ఈవీని ప్రవేశపెట్టగా.. సింగిల్-సీట్ రే, 20వేల డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Kia EV5 electric SUV 2023 Kia EV Day

2030 నాటికి 1.6 మిలియన్ల ఈవీల విక్రయం :
2023 ప్రారంభంలో కొరియాలో చైనీస్ నిర్మిత మోడల్ (Tesla Inc) కంపెనీ నుంచి Y SUV మోడల్ విక్రయించింది. ఈ కారు ధర సుమారు 57 మిలియన్ వోన్ (42,550 డాలర్లు)గా నిర్ణయించింది. ప్రభుత్వ సబ్సిడీలతో సియోల్‌లో ధర సుమారు 37వేల డాలర్లకి పడిపోయింది. ఈవీలకు అదనపు ప్రోత్సాహకాలను అందించే కొన్ని నగరాల్లో 30వేల డాలర్ల కన్నా తక్కువగా ఉంటుంది. చిన్న EVలు తక్కువ ధరలతో ఛార్జింగ్ సౌలభ్యంతో సరసమైన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కియా ప్రవేశించిందని అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హో సంగ్ సాంగ్ ఈవీ డేలో అన్నారు. 2030 నాటికి 1.6 మిలియన్ EVలను విక్రయించాలని వాహన తయారీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, కియా 2025 నాటికి 8 ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉండాలని యోచిస్తోంది.

2023 Kia EV new range EV5 Model

2025 నాటికి ఈవీ బ్యాటరీల ధరలు తగ్గొచ్చు :
యూరప్‌లో, కంపెనీ చిన్న, మధ్యతరహా ఈవీలను తయారు చేయడంపై దృష్టి పెడుతుంది. అయితే, చైనాలో మధ్య, పెద్ద-పరిమాణ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లకు అనుగుణంగా వ్యూహాత్మకంగా రూపొందించిన ఈవీ మోడళ్లపై దృష్టి పెడుతుందని హో సంగ్ సాంగ్ పేర్కొన్నారు. ఈవీ కార్ల ధరల తగ్గింపుపై కియా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన అన్నారు.

2023 Kia EV5 Car turn into bedrooms

భారత మార్కెట్లో సుమారు 25వేల కన్నా తక్కువ వాహనాలను ఎలా తయారు చేయాలి? భవిష్యత్తులో, బ్యాటరీ లేకుండా వాహనాలను ఎలా విక్రయించాలి? కొనుగోలుదారులు అద్దెకు ఇవ్వడం వంటి అంశాలపై సాంగ్ వివరించారు. 2025 నాటికి EVలో అత్యంత ఖరీదైన బ్యాటరీల ధరలు kWhకి 99 డాలరర్లకు తగ్గుతాయని భావిస్తున్నారు. బ్యాటరీ ఖర్చులు తగ్గుముఖం పట్టడంతో కియా స్టాక్‌ను మెరుగుపరిచే మార్జిన్‌ల కొనుగోలుకు అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో హ్యుందాయ్ :
SNE రీసెర్చ్ నివేదిక ప్రకారం.. కియా, అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ కో.. 2023 మొదటి 8 నెలల్లో దాదాపు 374,000 ఈవీలను విక్రయించింది, ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో నిలిచింది. చైనా BYD Co. బలమైన వృద్ధి కారణంగా ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలతో సహా గ్లోబల్ ఈవీ మార్కెట్‌లో సంయుక్త మార్కెట్ వాటా 2022లో 5.4శాతం నుంచి ఈ ఏడాదిలో 4.3శాతానికి పడిపోయిందని పరిశోధనా బృందం తెలిపింది. కియా యూరప్‌లో కాంపాక్ట్ మోడల్ EV2ని పరిచయం చేయవచ్చని హో సంగ్ సాంగ్ చెప్పారు. యూరోపియన్ యూనియన్ చైనా EV సబ్సిడీలపై విచారణ ప్రారంభించింది. దీని ఫలితంగా మేడ్-ఇన్-చైనా కార్లపై సుంకాలు విధించే అవకాశం ఉంది. తద్వారా కొరియా సంస్థకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

Read Also : Royal Enfield Meteor 350 : కుర్రాళ్ల డ్రీమ్ బైక్.. కొత్త వేరియంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 బుల్లెట్.. టాప్ ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు