Flipkart Big Billion Days Sale
Flipkart Sale End Today : అమెజాన్ (Amazon Great Indian Festival Sale), ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) కొనుగోలు చేయలేకపోయారా? మీకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. మీరు అదృష్టవంతులు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) నేటితో ముగుస్తుంది.
ఈ-కామర్స్ వెబ్సైట్లో ఐఫోన్ 14ని రూ. 60వేల కన్నాతక్కువ ధరకే అందిస్తున్నారు. అయితే, సేల్ ముగిసిన తర్వాత ధర తిరిగి రూ.65,999కి పెరగనుంది.బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల బెనిఫిట్స్ పొందడం ద్వారా రూ. 40వేల లోపు ఫోన్‌ను కూడా పొందవచ్చు. మీరు ఐఫోన్ 14ని చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం.. తక్కువ ధరకే సొంతం చేసుకోండి.
ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే? :
ప్రస్తుతం ఐఫోన్ 14 రూ. 57,999కి అందుబాటులో ఉంది. మీ పాత iPhone 12తో ఎక్స్ఛేంజ్ చేస్తే.. కొనుగోలుపై రూ. 20వేల వరకు ఆదా చేయవచ్చు. అదనంగా, iPhone 13ని కలిగి ఉంటే.. మీరు రూ. 30వేల వరకు డిస్కంట్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్ అయితే.. మీ కోసం అదనంగా 5శాతం తగ్గింపు పొందవచ్చు.
Flipkart Sale End Today
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14 Sale Offers) శక్తివంతమైన ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్. స్లిమ్ బార్డర్లతో అద్భుతమైన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను కలిగి ఉంది. శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. ఈ డిస్ప్లే వైడ్ రేంజ్ కలర్లను చూపుతుంది. HDR కంటెంట్‌కు సపోర్టు ఇస్తుంది. 1200-నిట్ ప్రకాశంతో ప్రకాశవంతమైన కలర్ ఫొటోలను అందిస్తుంది. సేఫ్ అన్లాకింగ్ ఫేస్ ఐడీని కూడా కలిగి ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే..
హుడ్ కింద.. ఐఫోన్ 14 A15 బయోనిక్ చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. దీన్ని 128GB, 256GB లేదా 512GB వంటి విభిన్న స్టోరేజీ ఆప్షన్లతో పొందవచ్చు. మీ ఫైల్లు, యాప్‌ల కోసం పుష్కలంగా స్టోరేజీ ఉంటుంది. సరికొత్త iOS16లో రన్ అవుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వేగవంతమైన ఇంటర్నెట్ 5Gకి సపోర్టు ఇస్తుంది. Wi-i, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, GPS, ఛార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ కోసం లైట్నింగ్ పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది.
ఐఫోన్ 14 కెమెరా ఫీచర్లు :
ఫొటోగ్రఫీ పరంగా ఐఫోన్ 14 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన 12MP కెమెరా తక్కువ కాంతిలో కూడా పదునైన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. వైడ్ షాట్ల కోసం 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంది. మెరుగైన డైనమిక్ పరిధి కోసం డాల్బీ విజన్‌తో హై-క్వాలిటీ వీడియోలను కూడా రికార్డ్ చేయగలదు.