House Rent: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగాయంటే?

హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ.28 వేలు ఉండగా, ట్రిపుల్ బెడ్‌రూమ్ అద్దె 35 వేల రూపాయలుగా ఉంది.

house rents hike in hyderabad

House Rents in Hyderabad: హైదరాబాద్‌లో అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువ కావడంతో.. ఇంటి రెంట్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆఫీస్ లన్నీ ఎంప్లాయిస్‌తో కలకలలాడుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా హౌస్ రెంట్స్ భారీగా పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం మెల్లమెల్లగా కుదుటపడుతోంది. నిన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో పనిచేసిన ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కలకలలాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు వచ్చి పనిచేయడం మొదలవ్వడంతో సొంత ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చేస్తున్నారు ఉద్యోగులు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఇంటి రెంట్స్ క్రమంగా పెరిగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు బాగా పెరిగిపోయాయి.

హైదరాబాద్‌లో లగ్జరీ అద్దె ఇళ్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. గడిచిన మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లో అద్దె ఇళ్లకు 22 శాతం డిమాండ్ పెరిగిందని మ్యాజిక్ బ్రిక్స్ తెలిపింది. ఇదే సమయంలో గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. మొత్తం గృహాల రెంట్ మార్కెట్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వాటా 55 శాతం ఉండగా, సింగిల్ బెడ్‌రూమ్ వాటా 23 శాతంగా, ట్రిపుల్ బెడ్‌రూమ్ అద్దె ఇళ్ల డిమాండ్‌ 20 శాతంగా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఇంటి అద్దెలు సగటున 5 శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక భాగ్యనగరంలో మణికొండ, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పుప్పాలగూడ, షేక్పేట్, టోలిచౌకి, ఉప్పల్, ఎల్బీనగర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్కు తగిన గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణమని మ్యాజిక్ బ్రిక్స్ చెబుతోంది.

Also Read: రియల్ ఫ్యూచర్.. 2030 నాటికి ఊహకందని రేంజ్ కి రియల్ ఎస్టేట్ మార్కెట్!

హైదరాబాద్లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ.28 వేలు ఉండగా, ట్రిపుల్ బెడ్‌రూమ్ అద్దె 35 వేల రూపాయలుగా ఉంది. కొండాపూర్లో 2 బీహెచ్కే రూ.21 వేలు, 3 బీహెచ్కే ఇళ్లకు రూ.30 వేల అద్దె చెల్లించాల్సి వస్తోంది. హైటెక్సిటీ ప్రాంతంలో 2 బీహెచ్కే రూ.32 వేలు, 3 బీహెచ్కేకు రూ.47 వేల అద్దె ఉంది. మాదాపూర్‌ డబుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ.24 వేలు ఉండగా, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె 32 వేల రూపాయలుగా ఉంది. కోకాపేటలో 2 బీహెచ్కే సగటు ఇంటి అద్దె రూ.26 వేలు, 3 బీహెచ్కే రూ.36 వేలు పలుకుతోంది.

Also Read: ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోన్న హైదరాబాద్.. 26 శాతం పెరిగిన సేల్స్

ఇక నార్సింగిలో డబుల్ బెడ్‌రూమ్ సగటు ఇంటి అద్దె రూ.22 వేలు, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇంటి రెంట్ రూ.32 వేలు. కూకట్‌పల్లిలో 2 బీహెచ్కే రెంట్ రూ.18 వేలు, 3 బీహెచ్కే రెంట్ రూ.25 వేలు. బంజారాహిల్స్‌ లో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ.30 వేలు, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ.40 వేలుగా ఉంది. జూబ్లీహిల్స్లో 2 బీహెచ్కే ఇంటి రెంట్ సగటున రూ.33 వేలు ఉండగా, 3 బీహెచ్కే ఇంటి రెంట్ రూ.43 వేలు. అటు మణికొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి రెంట్ రూ.21 వేలు, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇంటి అద్దె రూ.28 వేలుగా ఉంది. ఆయా ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్స్, గేటెట్ కమ్యూనిటీల్లో అయితే ఇంకా రెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి.

Also Read: తెలంగాణలో ప్లాట్లు, ఇళ్ల కొనుగోలుదారులకు రెరాతో రక్షణ.. ఎలాగో తెలుసా?

హైదరాబాద్ లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య, మధ్య తరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ, గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్కే ఖర్చవుతోందని వాపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు