Microsoft to Netflix : వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న పెద్ద టెక్ కంపెనీలివే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఆర్థికపరంగా చాలావరకూ నష్టపోయాయి.

Microsoft to Netflix : ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఆర్థికపరంగా చాలావరకూ నష్టపోయాయి. ఈ ఆర్థికభారంతో ఉద్యోగులను తొలగించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, టెస్లా, నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్ వంటి బిగ్ టెక్ కంపెనీలు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. వాస్తవానికి టెక్ ఇండస్ట్రీ కష్టకాలంలో ఉందనే చెప్పాలి. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు మాత్రం నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నాయి.

అంతేకాదు.. వందలాది మంది ఉద్యోగులను తమ కంపెనీల్లో నుంచి తొలగిస్తున్నాయి. తద్వారా కంపెనీ ఖర్చులను తగ్గించుకంటున్నాయి. ప్రస్తుతం ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ నుంచి నెట్ ఫ్లిక్స్ వరకు తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెస్లా కంపెనీ కాలిఫోర్నియాలోని శాన్ మాటియో ఆఫీసును మూసివేసింది. ఇటీవల ఆటోపైలట్ విభాగం నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు వందలాది మంది ఉద్యోగులను తొలగించిన టెక్ కంపెనీల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

మైక్రోసాఫ్ట్ (Microsoft) :
మైక్రోసాఫ్ట్ ఇటీవల ఇతర ప్రాంతాల్లోని కంపెనీల్లో 1800 మంది ఉద్యోగులను తొలగించింది. అది తమ నిర్మాణాత్మక సర్దుబాట్లలో భాగమని కంపెనీ తెలిపింది. జూన్ 30న ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత వ్యాపార గ్రూపులు తమ ఆర్థిక ఖర్చులను లెక్కేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ఉద్యోగాలను తగ్గించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయినప్పటికీ, కొత్త ఉద్యోగులను నియమించుకోవడం కొనసాగిస్తామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని కొత్త ఉద్యోగులతో పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో తొలగింపులు ఉన్నాయని చెబుతోంది. అన్ని కంపెనీల మాదిరిగానే.. మైక్రోసాఫ్ట్ వ్యాపార ప్రాధాన్యతలను క్రమ పద్ధతిలో చేపడుతోంది. తదనుగుణంగా నిర్మాణాత్మక సర్దుబాట్లు చేస్తామని మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌లోని మొత్తం ఉద్యోగుల్లో 1 శాతం కన్నా తక్కువ ఉద్యోగులను తొలగించాయి.

Microsoft To Netflix The Big Tech Companies Laid Off Hundreds Of Employees

నెట్‌ఫ్లిక్స్ (Netflix) :
గత నెలలో.. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించింది. మే 2022లో నెల ముందు ఉద్యోగాల్లో కోత విధించింది నెట్ ఫ్లిక్స్.. అయితే ఇప్పుడు Netflixలో రెండవ రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. మొదటి రౌండ్‌లో Netflix దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. అందులో ప్రధానంగా అమెరికాలోని డిపార్ట్‌మెంట్లలోనే ఎక్కువ మంది ఉన్నారు. రెండవ రౌండ్ తొలగింపుల సమయంలో.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఏడాది తరువాత మరికొన్ని తొలగింపులు ఉండవచ్చని సూచించింది.

Microsoft To Netflix The Big Tech Companies Laid Off Hundreds Of Employees (4)

ట్విట్టర్ (Twitter) :
జూలైలో కంపెనీ నియామకాలను ట్విట్టర్ నిలిపివేసింది. ఆ తర్వాత ట్విట్టర్ టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో 30 శాతం మందిని తొలగించింది. మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ తొలగించిన ఉద్యోగులకు భారీ ప్యాకేజీలను అందించినట్లు నివేదిక తెలిపింది.

Microsoft To Netflix The Big Tech Companies Laid Off Hundreds Of Employees 

టెస్లా (Tesla) :
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఇటీవల ఆటోపైలట్ బృందం నుంచి 229 మంది ఉద్యోగులను తొలగించింది. అమెరికా టెస్లా కార్యాలయాలలో ఒకదానిని మూసేసింది కూడా. కేవలం 276 మంది కార్మికులు పనిచేసే శాన్ మాటియో కార్యాలయం నుంచి టెస్లా ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Microsoft To Netflix The Big Tech Companies Laid Off Hundreds Of Employees 

మిగిలిన 47 మంది ఉద్యోగులు టెస్లా ‘బఫెలో ఆటోపైలట్’ ఆఫీసుకు బదిలీ అయ్యారు. జూన్‌లో మస్క్ ఆర్థిక వ్యవస్థ గురించి “సూపర్ బ్యాడ్ ఫీలింగ్” ఉందని హెచ్చరించాడు. జీతం తీసుకునే సిబ్బందిలో 10 శాతం మందిని తగ్గించాలని యోచిస్తున్నామని తెలిపాడు. ఇప్పటికే టెస్లా కంపెనీ పలు నియామకాలను నిలిపివేసింది.

Read Also : Microsoft employees : మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 1800 మంది ఉద్యోగులపై వేటు.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు