Ola S1 Air : అత్యంత సరసమైన ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీలు షురూ.. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Ola S1 Air price : ఓలా ఎలక్ట్రిక్ S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Ola S1 Air electric scooter deliveries : ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బ్రాండ్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన సరికొత్త S1 ఎయిర్‌ (Ola S1 Air Scooter)లను డెలివరీ చేయడం ప్రారంభించింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే, S1 ఎయిర్ స్కూటర్లు 50వేల కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

S1 ఎయిర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలతో ప్రారంభమైంది. అయితే, ఆ తరువాత సవరించగా.. అప్పటి నుంచి ఎక్స్-షోరూమ్ రూ. 1.20 లక్షలకు విక్రయిస్తోంది. దేశంలోని 100కి పైగా నగరాల్లో డెలివరీలను ప్రారంభించామని, త్వరలో మరిన్ని డెలివరీలను పెంచే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. S1 ఎయిర్ 3.0kWh బ్యాటరీ ప్యాక్, 58Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 8.5 kW మోటార్‌ను ఉపయోగిస్తుంది.

Read Also : Ola S1 Air Teaser Video : ఓలా టీజర్ అదిరింది.. అత్యంత సరసమైన ఓలా S1 ఎయిర్ స్కూటర్ వస్తోంది.. గంటకు 90 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది..!

సింగిల్ ఛార్జ్‌పై 151 కి.మీ దూసుకెళ్లగలదు :
ఓలా ఎలక్ట్రిక్ తయారీదారు కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 40kmph వరకు దూసుకెళ్లగలదు. అలాగే, 90kmph వద్ద గరిష్ట వేగంతో ఒకే ఛార్జ్‌పై 151కి.మీ పరిధిని అందిస్తుంది. 5 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇంకా, S1 ఎయిర్‌ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, 2 చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు, ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, GPS, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల FT డాష్‌బోర్డ్ ఉన్నాయి. S1 ఎయిర్ స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూతో సహా 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.

Ola S1 Air : commences deliveries of S1 Air electric scooter: Check price, features, and more

100 కన్నా ఎక్కువ నగరాల్లో ఓలా S1 ఎయిర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. త్వరలో ఇతర మార్కెట్‌లలోనూ ఓలా S1 ఎయిర్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఓలా S1 ఎయిర్ ఈవీ స్కూటర్‌ను EMI ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ కూడా ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లోనూ ఫైనాన్స్ ఆప్షన్‌తో S1 ఎయిర్ కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్ (Axis) బ్యాంక్, ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ లాంటి బ్యాంకులన్నీ EMI ఆప్షన్ ద్వారా అందిస్తున్నాయి.

ఓలా S1 ఎయిర్ ధర రూ.1,19,999 ఉండగా.. EMI ఆప్షన్ కింద వడ్డీ రేటు 8.9 శాతం అందిస్తుంది. రూ.10 వేలు డౌన్‌పేమెంట్ చెల్లించడం ద్వారా మిగిలిన రూ.1,09,999పై లోన్ పొందవచ్చు. 48 నెలల EMI ఆప్షన్ ద్వారా నెలకు రూ.2,730 EMI, 36 నెలల ఆప్షన్‌పై నెలకు రూ.3,491 EMI చెల్లించాలి. 24 నెలల ఆప్షన్ ద్వారా నెలకు ఈఎంఐ రూ.5,018, 12 నెలల వ్యవధిలో నెలకు ఈఎంఐ రూ.9,612 చెల్లించాలి. అయితే, ఈ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజ్ ఉండదని గమనించాలి. కస్టమర్ల ప్రొఫైల్‌ ఆధారంగా వడ్డీ రేటుకే ఓలా S1 ఎయిర్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే లీకైన ధర, ఫీచర్లు ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు