Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా..

Ex Minister Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలానగర్ లో మల్లారెడ్డి యూనివర్శిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ (ఆఫ్ క్యాంపస్) పేరుతో క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ నవీనా ఎడ్యుకేషనల్ సొసైటీ, ప్రతిభా కాలేజీ, తదితరులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన క్యాంపస్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని యూజీసీ(UGC), ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 24కు కోర్టు వాయిదా వేసింది.

Also Read : Team India : వాంఖడే స్టేడియంలో కోహ్లీ, రోహిత్ భావోద్వేగ ప్రసంగం.. వారు ఏమన్నారంటే

గతంలో ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతివాదులైన మల్లారెడ్డి యూనివర్శిటీ, ఆఫ్ క్యాంపస్ కు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని ఏప్రిల్ 25న పిటిషన్ తరపు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, మల్లారెడ్డి యూర్సిటీ ఆఫ్ క్యాంపస్ ప్రతినిధులు నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ విషయంను పిటీషనర్ల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు తిరస్కరించినా అందినట్లుగానే భావించాలని కోర్టును కోరారు. అయితే, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సహా ఇతర అధికారిక ప్రతివాదులెవరూ పిటీషనర్ల తరపు న్యాయవాది వాదనలను వ్యతిరేకించలేదు. దీంతో వాదనలు నమోదు చేసుకున్న హైకోర్టు తాజాగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

 

 

ట్రెండింగ్ వార్తలు