Ola Electric August Sales : ఆగస్టు అమ్మ‌కాల్లో దుమ్ములేపిన ఓలా ఎలక్ట్రిక్.. ఈవీ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం..!

Ola Electric August Sales : ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఆగస్టు అమ్మకాల్లో ఏకంగా 400శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏడాది పాటుగా ఈవీ మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

Ola Electric August Sales : భారత అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) గత ఏడాది కాలంగా ఈవీ టూవీలర్ (EV 2W) సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆగస్టులో 19వేల యూనిట్ల (వాహన్ డేటా ప్రకారం) అమ్మకాలతో 400 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా 30శాతం మార్కెట్ వాటాను ఓలా సొంతం చేసుకుంది. ఆగస్టులో Ola Gen-1 నుంచి Gen-2కి మారింది. ఈ కాలంలో కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని కూడా విస్తరించింది.

ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ (Ankush Aggarwal)  మాట్లాడుతూ.. ‘ఆగస్టులో మా పోర్ట్‌ఫోలియోను అన్ని ప్రముఖ ధరల పాయింట్లలో 5 స్కూటర్లకు విస్తరించాం. సరికొత్త S1 లైనప్ (Ola S1 Scooter) ఈవీ స్కూటర్లను వేగవంతం చేయడం జరిగింది. పండుగల సీజన్‌తో ఈ కాలంలో బలమైన అమ్మకాలను ఆశిస్తున్నాం. అధిక వినియోగదారుల డిమాండ్ కారణంగా ఈవీ పరిశ్రమ ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్‌ను చూస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు. ఓలా లేటెస్ట్ S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోకు అద్భుతమైన స్పందన లభించిందని అగర్వాల్ తెలిపారు.

Read Also : Ola Electric Production : ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఆ 5 రోజులు ఎందుకంటే? అసలు కారణం ఇదే..!

ఓలా S1 స్కూటర్ లాంచ్ అయిన 2 వారాల్లోనే 75వేల బుకింగ్‌లను పొందింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని పెంచడానికి, మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి 3 షిఫ్టులలో పనిచేస్తుంది. ఓలా వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో భాగంగా ఆవిష్కరించిన S1 Pro, S1 Air , S1X+, S1X (3kWh), S1X (2kWh) సరికొత్త, అత్యంత అధునాతనమైన Gen-2 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించినట్టు ఓలా సీఈఓ పేర్కొన్నారు.

Ola S1 Pro :
ఓలా S1ప్రో స్కూటర్.. రూ. 1,47,499 ధరతో, (Gen-2 S1 Pro) ఇప్పుడు ట్విన్-ఫోర్క్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్‌తో పాటు మెరుగైన 195kతో వస్తుంది. 120కి.మీ పరిధిని అందిస్తుంది. ఇప్పటికే, S1 ప్రో Gen 2 కొనుగోలు విండో ఓపెన్ అయింది. అయితే స్కూటర్ల డెలివరీలు సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమవుతాయి.

Ola Electric Registers 400 Percent YoY Growth In August Sales, Dominating

S1 Air :
ఓలా S1 ఎయిర్ స్కూటర్ ధర రూ. 1,19,999, S1 ఎయిర్ బలమైన 3kWh బ్యాటరీ కెపాసిటీ, 6kW గరిష్ట మోటార్ పవర్, 151కి.మీ సర్టిఫైడ్ రేంజ్, 90కి.మీ/గంట గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. ఇటీవల 100 కన్నా ఎక్కువ నగరాల్లో S1 ఎయిర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి.

ICE- కిల్లర్ S1X :
ఓలా ఎలక్ట్రిక్ ICE-కిల్లర్ స్కూటర్ S1X మోడల్‌పై అన్ని రకాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా S1 X+, S1 X (2kWh), S1 X (3kWh) అనే మొత్తం 3 వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. అయితే, S1 X+ (3kWh), S1 X (3kWh) రెండూ శక్తివంతమైన 6kW మోటార్, 3kWh బ్యాటరీ, 151కి.మీ పరిధి, 90 km/h గరిష్ట వేగంతో వస్తాయి. S1 X (2kWh) శక్తివంతమైన 6kW మోటార్‌తో కూడా వస్తుంది. ఇందులో 91కి.మీ పరిధి, గరిష్ట వేగం గంటకు 85కి.మీ అందిస్తుంది.

S1X+ మోడల్ స్కూటర్ ధర రూ. 109,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ల డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం, S1 X (3kWh), S1 X (2kWh) ప్రీ-రిజర్వేషన్ విండో రూ. 999గా కొనసాగుతోంది. ఈ స్కూటర్ల డెలివరీలు డిసెంబర్‌లో ప్రారంభమవుతాయి. ఓలా S1X (3kWh), S1 X (2kWh) స్కూటర్ల ధర రూ. 99,999, రూ. 89,999 మధ్య అందుబాటులో ఉన్నాయి.

Read Also : Ola S1 e-scooters : కేవలం 2 వారాల్లోనే 75వేలకు పైగా బుకింగ్స్.. కొత్త ఓలా S1 ఈవీ స్కూటర్ల రేంజ్ మామూలుగా లేదుగా..!

ట్రెండింగ్ వార్తలు