Ola Electric Production : ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఆ 5 రోజులు ఎందుకంటే? అసలు కారణం ఇదే..!

Ola Electric Production : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఆగస్టు 24, 2023 నుంచి ఆగస్టు 28 వరకు మొత్తం 5 రోజుల పాటు అన్ని స్టోర్లు పనిచేయవు. ఆ తర్వాత మొత్తం 3 షిఫ్టులలో ఉత్పత్తి పనులు పునఃప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

Ola Electric Production : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రొడక్షన్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. షెడ్యూల్డ్ కెపాసిటీ విస్తరణ, ఎక్విప్‌మెంట్ అప్‌గ్రేడేషన్ పనుల కారణంగా ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తమిళనాడులోని పోచంపల్లిలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. దాంతో ఓలాకు సంబంధించి అన్ని స్టోరులు 5 రోజుల (24 ఆగస్టు 2023 నుంచి ఆగస్టు 28) పాటు పనిచేయవు.

29 ఆగస్టు 2023 ఉదయం 6 గంటల నుంచి మొత్తం 3 షిఫ్టులలో ఉత్పత్తి పనులు పునఃప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు ఉద్యోగులందరికీ ఓలా సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం.. ఫ్యాక్టరీ అడ్మిన్, సెక్యూరిటీ, HR టీమ్‌లు ఆయా వ్యవధిలో పని చేస్తూనే ఉంటాయి. మెయింటెనెన్స్, కొత్త మెషీన్ల ఇన్‌స్టాలేషన్ కారణమని పేర్కొంటూ కంపెనీ గతంలో 21 జూలై 2022న ఉత్పత్తిని నిలిపివేసింది.

Read Also : Infinix Zero 30 5G Pre-Orders : కొత్త ఫోన్ కొంటున్నారా? సెప్టెంబర్ 2 నుంచి ఈ 5G ఫోన్‌పై ప్రీ-ఆర్డర్లు.. కీలక ఫీచర్లు ఇవే..!

ప్రధాన కారణం ఏంటంటే? :
నివేదిక ప్రకారం.. పనులు నిలిచిపోవడానికి ఇన్వెంటరీ పైల్-అప్ ప్రధాన కారణమని ఓలా తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో దాదాపు 4వేల యూనిట్ల స్కూటర్లను ఉత్పత్తి చేసింది. అయితే, ఆగష్టు 15, 2023న ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త, ఎంట్రీ లెవల్ ఆఫర్ ఓలా S1X అనే పేరుతో 3 వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. అత్యంత సరసమైన 2kWh వేరియంట్ ధర రూ. 89,999కు అందిస్తోంది.

Ola Electric shuts production for 5 days to expand capacity

ఓలా మిడ్-స్పెక్ వేరియంట్ రూ. 99,999 ధరతో పెద్ద 3kWh బ్యాటరీని పొందుతుంది. ఓలా S1 X+ స్కూటర్ ట్రిమ్ టాప్ లైన్ ధర రూ. 1,09,999 ఉండగా.. అదనపు కనెక్టివిటీ ఫీచర్‌లను అందిస్తుంది. కంపెనీ డైమండ్‌హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్, రోడ్‌స్టర్ అనే 4 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కూడా అదే రోజున వెల్లడించింది. అందుకోసం.. ముందస్తు రిజర్వేషన్‌లను ప్రారంభించింది. లాంచ్ 2024 చివరి నాటికి జరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే రోజు కొంతమంది జర్నలిస్టులను ఉద్దేశించి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిడ్-లెవల్, ఎంట్రీ లెవల్ మోటార్‌బైక్‌లపై పని చేస్తున్నాం. మా సామర్థ్యాన్ని పెంచుకునే ప్రక్రియలో ఉన్నాం. దీనికి నిధులు సమకూర్చడానికి బలమైన బ్యాలెన్స్ షీట్ ఉంది. లాభదాయకంగా ఉన్న ప్రస్తుత ఉత్పత్తుల నుంచి కూడా మాకు అంతర్గత సమస్యలు ఉన్నాయి. ఆగస్ట్ 24, 2023 నాటికి, కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేసిన కొత్త S1 ఎయిర్ డెలివరీలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఇప్పటి వరకు 50వేల బుకింగ్‌లు వచ్చాయి’ అని అగర్వాల్ అన్నారు.

Read Also : Moto G54 5G Launch Date : మోటో G54 5G ఫోన్ వస్తోంది.. సెప్టెంబర్ 5నే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

ట్రెండింగ్ వార్తలు