Reliance AGM 2023 Updates : జియో యూజర్లకు అంబానీ గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి జియో 5G ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు..!

Reliance AGM 2023 Updates : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమైంది. చైర్మన్ ముఖేష్ అంబానీ పెట్టుబడిదారులు, మార్కెట్ పరిశీలకులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక వృద్ధిపై అంబానీ విస్తృతంగా మాట్లాడారు.

Reliance AGM 2023 Updates : ప్రముఖ రిల్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 46వ RL AGM ఈవెంట్‌లో (Jio 5G)కి సంబంధించిన కీలక అప్‌డేట్‌లను ప్రకటించారు. డిసెంబర్ నాటికి 5G ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని ఆయన సూచించారు. అదనంగా, (Jio AirFiber), వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్, సెప్టెంబర్ 19న లాంచ్ అవుతుందని ప్రకటించారు. రిలయన్స్ జియో (Reliance Jio) గత ఏడాది అక్టోబర్‌లో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 2023 చివరి నాటికి భారత్ అంతటా అందుబాటులోకి వస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

Read Also : Reliance AGM 2023 Event : రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలపై ఆసక్తి.. లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

జియో 5G ప్లాన్లు సరసమైన ధరకే వస్తాయా? :
ఆ తర్వాత, అంబానీ 96 శాతం జనాభా గణన పట్టణాలను 5Gతో కవర్ చేయగలిగినట్లు పేర్కొన్నారు. జియో 5G ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల రోల్ అవుట్ గురించి స్పష్టమైన తేదీలను వెల్లడించలేదు. కానీ, డిసెంబర్ చివరి నాటికి వినియోగదారులు జియో 5G ప్లాన్‌లకు సభ్యత్వాన్ని పొందగలరని అంబానీ ప్రకటించారు. ఈ ఏడాది (2023) డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జియో 5G బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. జియో 5G ప్లాన్‌లు ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరకు లభిస్తాయని అంబానీ గతంలో వాగ్దానం చేయగా.. దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Reliance AGM 2023 Updates _ Reliance Jio 5G prepaid and postpaid plans to reach Customers in December

గత అక్టోబర్‌లో 5G నెట్‌వర్క్ ప్రారంభించామని, కేవలం 9 నెలల్లో, దేశంలోని 96 శాతానికి పైగా జనాభా పట్టణాలలో ఇప్పటికే Jio 5G అందుబాటులో ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా జియో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జియో 5G అత్యంత వేగవంతమైన 5G నెట్‌వర్క్ అని అంబానీ తెలిపారు. ప్రస్తుతం, భారత్‌లో అన్ని కార్యాచరణ 5G సెల్‌లలో దాదాపు 85శాతం జియో నెట్‌వర్క్‌లో భాగమని అన్నారు.

కంపెనీ వేగవంతమైన విస్తరణ కారణంగా ప్రతి 10 సెకన్లకు ఒక కొత్త 5G సెల్‌ను ఏర్పాటు జరుగుతుందని కంపెనీ తెలిపింది. డిసెంబర్ నాటికి, జియో తన నెట్‌వర్క్‌లో దాదాపు ఒక మిలియన్ కార్యాచరణ 5G సెల్‌లను కలిగి ఉంటుందని అంచనా వేస్తోంది. అంతేకాదు.. (JioAirFiber) లాంచ్ తేదీని కూడా అంబానీ ప్రకటించారు. సెప్టెంబర్ 19 గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్ ఫైబర్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ సర్వీసుతో రోజుకు 1.5 లక్షల కనెక్షన్‌లతో విస్తరణను సూపర్‌ఛార్జ్ చేయవచ్చునని రిల్ అధినేత స్పష్టం చేశారు.

Read Also : Reliance AGM 2023 Updates : ముఖేష్ అంబానీ కీలక ప్రకటన.. వచ్చే సెప్టెంబర్ 19నే జియో ఎయిర్‌ఫైబర్ లాంచ్.. ఇంకా ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు